వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !

|
Google Oneindia TeluguNews

ముంబై/ అహ్మద్ నగర్: రాముడు మావాడు, అల్లా మీవాడు అని చీటికిమాటికి పొట్లాడుకుంటున్న ఈ కాలంలో ఓ ముస్లీం సోదరుడు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుంటున్నారు. సొంత అక్కచెల్లెళ్లు లేరని ఆవేదన చెందిన ఓ ముస్లీం సోదరుడు ఇద్దరు హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకున్న ఇద్దరు యువతులు పెళ్లి వయసుకు రావడంతో వారికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించాడు, ముస్లీంల ఇంటిలో పెరిగిన ఇద్దరు అమ్మాయిలకు వారి ఇష్ట ప్రకారం సొంత ఖర్చులతో హిందూ సాంప్రధాయ పద్దతితో పెళ్లి చేసి నేడే దేశానికి ఆదర్శంగా నిలిచాడు ఆ ముస్లీం సోదరుడు. విషయం తెలుసుకున్న సాటి ప్రజలు సలామ్ భాయ్ అంటున్నారు.

Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !Coronavirus: ఆసుపత్రిలో రోగి మాయం, డ్రైనేజ్ లో శవం, కిడ్నీలు కొట్టేసి హత్య ?, ఆసుపత్రి మటాష్ !

 ముస్లీం సోదరుడి ఆవేదన

ముస్లీం సోదరుడి ఆవేదన

మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో బాబాభాయ్ పఠాన్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. బాబాభాయ్ పఠాన్ కు అందరు సోదరులే ఉన్నారు. అక్కచెల్లెళ్లు లేరని బాబాభాయ్ పఠాన్ మొదట ఆవేదన చెందారు. ఆడపిల్లలను పెంచుకుని వారితో సంతోషంగా గడపాలని చాలా కాలం ఆవేదన చెందాడు.

 హిందూ అమ్మాయిలు దత్తత

హిందూ అమ్మాయిలు దత్తత

తల్లిదండ్రులకు అమ్మాయిలు జన్మించకపోవడంతో బాబాభాయ్ పఠాన్ ఓ నిర్ణయానికి వచ్చాడు. ఒక ఆనాథఆశ్రయం చేరుకున్న బాబాభాయ్ పఠాన్ ఇద్దరు అనాథ అమ్మాయిలను దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. అయితే అనాథ ఆశ్రమంలో అందరూ హిందూ అమ్మాయిలు ఉండటంతో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని ఇద్దరు హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్నారు.

 పెళ్లి ఎలా చెయ్యాలి !

పెళ్లి ఎలా చెయ్యాలి !

దత్తత తీసుకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి వయసు రావడంతో వారికి పెళ్లి చెయ్యాలని బాబాభాయ్ పఠాన్ నిర్ణయించాడు. తన పెంపుడు చెల్లెళ్లకు ముస్లీం సాంప్రధాయం ప్రకారం పెళ్లి చెయ్యాలా ? లేక హిందూ సాంప్రధాయం ప్రకారం పెళ్లి చెయ్యాలా ? అని బాబాభాయ్ పఠాన్ ఆలోచించాడు. అయితే పెళ్లి చేసుకున్న ఇద్దరు చెల్లెళ్లు ఏ మతం ప్రకారం పెళ్లి చేసుకోవాలో అనే నిర్ణయాన్ని వారికే విదిలేశాడు.

 హిందూ సంపాధ్రాయాలతో పెళ్లి

హిందూ సంపాధ్రాయాలతో పెళ్లి

దత్తత తీసుకున్న ఇద్దరు చెల్లెళ్ల ఇష్టప్రకారం హిందూ సంప్రధాయం ప్రకారం పెళ్లి చెయ్యడానికి బాబాభాయ్ పఠాన్ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇంతకాలం కష్టపడి సంపాధించిన డబ్బు, బంగారం దత్తత తీసుకున్న ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చెయ్యడానికి బాబాభాయ్ పఠాన్ దాచిపెట్టాడు. ఎవ్వరినీ చెయ్యిచాచి ఒక్కరూపాయికూడా అడగకుండా ఇద్దరు చెల్లెళ్ల వివాహం హిందూ సాంప్రధాయం ప్రకారం బాబాభాయ్ పఠాన్ ఘనంగా నిర్వహించాడు.

 సలామ్ బాబాభాయ్

సలామ్ బాబాభాయ్

ముస్లీం వ్యక్తి అయిన బాబాభాయ్ పఠాన్ దత్తత తీసుకున్న ఇద్దరు చెల్లెళ్లకు హిందూ సాంప్రధాయం ప్రకారం వివాహాలు చేసి వారిని అత్తగారింటికి పంపించే సమయంలో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, అన్నను వదిలి భర్తలతో వెలుతున్న సమయంలో ఇద్దరు చెల్లెళ్లు కన్నీలు పెట్టుకుంటున్న సమయంలో జర్నలిస్టు ఆరీఫ్ షా ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బాబాభాయ్ పఠాన్, ఆయన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి విషయం తెలుసుకున్న నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. నువ్వు హిందూ, నేను ముస్లీం అంటూ కొట్టుకుని చస్తున్న ఈ కాలంలో బాబాభాయ్ పఠాన్ లాంటి వ్యక్తి దేశానికి ఆదర్శంగా నిలిచారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బాబాభాయ్ పఠాన్, ఆయన ఇద్దరు చెల్లెళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

English summary
Salam bhai: Maharashtra Muslim man marries off adopted sisters in Hindu ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X