• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Salary hike: పోరా... నీతిలేని కుక్క, జీతం పెంచలేదని ప్రతీకారం, రూ. 10 లక్షల స్కెచ్, క్లైమాక్స్ లో !

|

న్యూఢిల్లీ/ ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బకు లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు ఊడిపోతాయో ? అనే భయం చాలా మందిలో ఉంది. ఇక లాక్ డౌన్ సందర్బంగా భారతదేశంలోని కొన్ని లక్షల మంది వలస కూలీలు, కార్మికులు, ఉద్యోగులు రోడ్డునపడ్డారు. అయితే కొన్ని సంవత్సరాల నుంచి తాను విశ్వాసంగా పనిచేస్తున్నా తన యజమాని జీతం పెచంలేదని ఓ ఉద్యోగి రగిలిపోయాడు. రేయ్... నీతిలేని కుక్క... నీకు నేనే సరైనోడు, చూస్తూఉండూ నీకు తగిన బుద్ది చెబుతాను అంటూ ఇంతకాలం వేచి చూశాడు. ఇదే సమయంలో సినిమా స్కెచ్ వేసిన ఆ ఉద్యోగి యజమానికి చెందిన రూ. 10 లక్షలు లూటీ చెయ్యడమే కాకుండా అతనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరికి క్లైమాక్స్ సీన్ రివర్స్ కావడంతో ఆ ఉద్యోగికి సెకండ్ పార్ట్ మొదలైయ్యింది.

Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!Horror murder: బెడ్ రూమ్ లో సెక్స్ పాఠాలు చెప్పాలని భర్త టార్చర్, మర్మాంగం కొరికేసిన భార్య!

నమ్మకమైన ఉద్యోగిగా గుర్తింపు

నమ్మకమైన ఉద్యోగిగా గుర్తింపు

ఢిల్లీలో నితిన్ అనే ప్రముఖ బిల్డర్ అనేక వ్యాపారాలు చేస్తున్నాడు. బిల్డర్ నితిన్ దగ్గర విజయ్ ప్రతాప్ దీక్షిత్ కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు. నితిన్ దగ్గర పని చేస్తున్న వారికంటే విజయ్ ప్రతాప్ దీక్షిత్ మీద ఆ సంస్థ యజమాని నితిన్ కు ఎక్కువ నమ్మకం ఉంది. విజయ్ ప్రతాప్ దీక్షిత్ కూడా యజమాని నితిన్ దగ్గర నమ్మకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చకున్నాడు.

సార్.... జీతం పెంచండి

సార్.... జీతం పెంచండి


కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో ఇటీవల నితిన్ ఆ సంస్థ ఉద్యోగులకు అంతంతమాత్రంగానే చూసుకుంటున్నాడని సమాచారం. ఇదే సమయంలో తాను ఎన్నో సంవత్సరాల నుంచి మీదగ్గర ఉద్యోగం చేస్తున్నానని, నాకు జీతం పెంచాలని విజయ్ ప్రతాప్ దీక్షిత్ అతని యజమాని నితిక్ కు చెప్పాడు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తాను జీతం పెంచలేనని యజమాని నితిన్ చేతులు ఎత్దేశాడు.

 రేయ్... నీతిలేని కుక్క... నీ కథ చూస్తా ?

రేయ్... నీతిలేని కుక్క... నీ కథ చూస్తా ?


ఎన్ని సంవత్సరాలు అయినా తనకు జీతం పెంచలేదని, కుటుంబ పోషణ చాలాకష్టంగా ఉందని విజయ్ ప్రతాప్ దీక్షిత్ అయోమయానికి గురైనాడు. ఇంతకాలం నీతినీజాయితీగా పని చేసినా నాకు అన్యాయం జరిగిందని, నేకా జీతం పెంచను అంటావా ? రేయ్ నీతిలేని కుక్క... నీ అంతు చూస్తా ఉండూఅంటూ విజయ్ ప్రతాప్ దీక్షిత్ రగిలిపోయాడు.

రామ్ గోపాల్ వర్మ సినిమా స్కెచ్

రామ్ గోపాల్ వర్మ సినిమా స్కెచ్

ఈనెల ఆగస్టు 13వ తేదీన యజమాని నితిన్ ఉద్యోగి విజయ్ ప్రతాప్ దీక్షిత్ ను పిలిచి రూ. 2 లక్షలు డబ్బులు, రూ. 10 లక్షల చెక్ ఇచ్చి కంపెనీ మేనేజర్ కు ఇవ్వాలని చెప్పాడు. విజయ్ ప్రతాప్ దీక్షిత్ చెక్ తీసుకెళ్లి ఢిల్లీలోని మోడల్ టౌన్ లోని కంపెనీ మేనేజర్ మహేష్ కు ఇచ్చి రూ. 10 లక్షలు డబ్బులు తీసుకుని బ్యాగ్ లో పెట్టుకుని నితిన్ దగ్గరకు బయలుదేరాడు. మార్గం మద్యలో ఫరిదాబాద్ లోని బారావుల్లా ఫ్లైఓవర్ సమీపంలో వెలుతున్న సమయంలో రెండు బైకుల్లో వచ్చిన ముగ్గురు వ్యక్తుల తనను కత్తులతో బెదిరించి రూ. 10 లక్షలు నగదు ఉన్న బ్యాగ్ లాక్కొనిపారిపోయారని విజయ్ ప్రతాప్ దీక్షిత్ అతని యజమాని నితిన్ కు ఫోన్ చేసి చెప్పాడు.

 ఒకే నోటితో డిఫరెంట్ డైలాగ్

ఒకే నోటితో డిఫరెంట్ డైలాగ్

పోలీసులు విజయ్ ప్రతాప్ దీక్షిత్ తో పాటు అతని యజమాని నితిన్ ను విచారణ చేశారు. ఆ సమయంలో విజయ్ ప్రతాప్ దీక్షిత్ పదేపదే అతని మాటలు మార్చడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తాను బారావుల్లా ప్రాంతంలో వెలుతున్న సమయంలో కత్తులతో బెదిరించి ముగ్గురు రూ. 10 లక్షలు లూటీ చేశారని విజయ్ ప్రతాప్ దీక్షిత్ అతని యజమాని నితిన్ కు చెప్పాడు. అయితే సెరాయ్ కాళే ఖాన్ ప్రాంతంలో వెలుతున్న సమయంలో బైక్ లో వచ్చిన ముగ్గురు వ్యక్తులు రూ. 10 లక్షలు లూటీ చేశారని విజయ్ ప్రతాప్ దీక్షిత్ పోలీసులకు చెప్పాడు.

 పగ... ప్రతీకారం... క్లైమాక్స్ లో ట్విస్ట్

పగ... ప్రతీకారం... క్లైమాక్స్ లో ట్విస్ట్

విజయ్ ప్రతాప్ దీక్షిత్ మాటల్లో తేడా రావడంతో పోలీసులు అతన్ని బెండ్ తియ్యడంతో అసలు విషయం బయటపడింది. తన యజమాని ఎన్ని సంవత్సరాలు అయినా తనకు జీతం పెంచలేదని, అంతే కాకుండా ఇటీవల నడిరోడ్డులో అందరి ముందు తన చెంప చెల్లుమనిపించి అవమానించాడని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి తాను రూ. 10 లక్షలు లూటీ అయ్యిందని నాటకం ఆడానని విజయ్ ప్రతాప్ దీక్షిత్ నేరం అంగీకరించాడు. విజయ్ దీక్షిత్ నుంచి రూ. 10 లక్షలు స్వాధీనం చేసుకుని విజయ్ ప్రతాప్ దీక్షిత్ మీద చీటింగ్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

English summary
Salary hike: A man has staged a robbery to take revenge against his employer for not getting salary hike in Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X