వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ ఖాన్ ఉద్వేగం: మందేసింది ఎవరో! ట్వీట్ల జోరు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ఒకరి ప్రాణాలు బలిగొని, నలుగుర్ని గాయపరిచిన హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6, 2015న తీర్పు ఇచ్చింది. అయితే, హైకోర్టు సల్మాన్ ఖాన్‌ను గురువారం నిర్దోషిగా ప్రకటించింది.

సరైన సాక్ష్యాలు లేనందున సల్మాన్‌ను నిర్దోషిగా పేర్కొంటూ బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. సల్మాన్ ఖాన్ తాగి కారు నడిపాడనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని, అందువల్ల ఈ కేసులో సల్మాన్‌ను దోషిగా నిర్ధారించలేమని కోర్టు వెల్లడించింది. సల్మాన్‌పై అభియోగాల నిరూపణలో ప్రాసిక్యూషన్ విఫలమైందని హైకోర్టు తీర్పునిచ్చింది.

Salman Khan acquitted of all charges in hit and run case: Twitterati question high court's verdict

పదమూడు సంవత్సరాల నాటి కేసులో నిర్దోషిగా బయటపడినందున సల్మాన్ ఖాన్ భావోద్వేగానికి లోనయ్యాడు. మధ్యాహ్నం నుంచి కోర్టు హాల్లో, తన కుటుంబ సభ్యులతో కలసి కూర్చుని ఉన్న సల్మాన్ గంభీరంగా కనిపించాడు. జడ్జి తీర్పు వెలువరించిన అనంతరం ఆయన బంధువులు ఒక్కసారిగా చుట్టుముట్టగా, సల్మాన్ కంట నీరు ఉబికి వచ్చింది.

మరోవైపు, సల్మాన్ ఖాన్‌ను న్యాయస్థానం నిర్దోషిగా తీర్పు చెప్పడంతో సామాజిక అనుసంధాన వేదికల్లో పలువురు స్పందిస్తున్నారు. సల్మాన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు కోర్టు తీర్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు చాలామంది అభినందనలు తెలుపుతున్నారు. మరికొందరు సెటైర్లు రాస్తున్నారు. 'అంతిమంగా మనకు తెలిసింది..! కారు తాగి ఉంది (మందు)' అని, 'ఇది బాధాకరమైన రోజు' అని ఇంకొందరు పేర్కొన్నారు.

English summary
The Bollywood superstar Salman Khan has now become a "Free Bird" today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X