వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ ఓ నమ్మక ద్రోహి: శ్రీలంకలో ప్రచారంపై వైగో, తమిళనాట నిరసనలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే తరపున ప్రచారం చేయనున్న అంశం వివాదంగా మారింది. వచ్చే నెలలో శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌లు గత ఆదివారం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ రాజపక్సేకు మద్దతుగా వీరిద్దరూ ప్రచారం చేయనున్నారు.

కాగా, శ్రీలంకలోని తమిళులను చిత్రహింసలకు గురి చేసి హతమార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేకు మద్దతుగా సల్మాన్ ఖాన్ ప్రచారం చేయడంపై తమిళనాడులో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఎండిఎంకె అధినేత వైగో సల్మాన్ ఖాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ ఓ నమ్మక ద్రోహి అని విమర్శించారు. కాగా, తమిళనాడులో సల్మాన్‌కు వ్యతిరేకంగా పలు రాజకీయ పార్టీలు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి.

Salman Khan a betrayer, says MDMK chief Vaiko

ఇది ఇలా ఉండగా శ్రీలంకలోని కొలంబోలో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మొట్టమొదటి భారతీయ నటుడిగా సల్మాన్ ఖాన్ చరిత్రకెక్కనున్నారు. ఈ సారి ఎన్నికల్లో అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేకు మద్దతుగా సల్మాన్, జాక్వెలిన్‌తో పాటు మరో ఐదుగురు బాలీవుడ్ నటులు ప్రచారం చేయనున్నారు.

రాజపక్స కుమారుడు, ఎంపీ నమల్ ప్రచారం కోసం సల్మాన్ ను ఆహ్వానించినట్టు స్థానిక వెబ్ సైట్ 'ఏషియన్ మిర్రర్' పేర్కొంది. ఈ మేరకు సల్మాన్ ఆదివారం శ్రీలంక చేరుకున్నట్టు తెలుస్తోంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్వదేశం శ్రీలంకే. ఈ మాజీ 'మిస్ శ్రీలంక' రాజపక్స తనయుడు నమల్‌కు మంచి స్నేహితురాలు. శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జనవరి 8న జరగనున్నాయి.

English summary
Hitting out at Bollywood actor Salman Khan for allegedly campaigning for Sri Lankan President Mahinda Rajapaksa, MDMK chief Vaiko on Monday dubbed him as a 'betrayer.'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X