వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విఐపీలు జైలును తప్పించుకోవచ్చు: సల్మాన్ కేసుపై కిరణ్ బేడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తమ న్యాయసహాయంతో విఐపీలు తమ జైలు జీవితాన్ని తప్పించుకోవచ్చని మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ అన్నారు. ఈ విషయం ప్రముఖ బాలీవుడ్ నటుడు, హిట్ రన్ కేసులో నిందితుడు సల్మాన్ ఖాన్‌కు బెయిల్ లభించడం ద్వారా వెల్లడైందని అన్నారు.

హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్‌కు సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ హైకోర్టుకు వెళ్లి ఉత్తమ న్యాయసహాయంతో తన జైలు జీవితాన్ని తప్పించుకున్నారని బిజెపి నేత కూడా అయిన కిరణ్ బేడీ అన్నారు.

Salman Khan case shows VIPs can avoid jail: Kiran Bedi

అంటే విఐపీలు తమకున్న పలుకుబడి, డబ్బుతో ఉత్తమ న్యాయసహాయం పొంది, జైలు జీవితాన్ని తప్పించుకోవచ్చనే విషయం వెల్లడైందని ఆమె చెప్పారు.

సల్మాన్ ఖాన్‌కు సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ బాంబై హైకోర్టు ఆశ్రయించగా.. వాదనలు విన్న తర్వాత కింది కోర్టు తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

English summary
The bail given to Bollywood star Salman Khan has given the impression that VIPs and the rich can avoid jail with "best legal aid", former police officer Kiran Bedi said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X