India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ ఖాన్‌కు పాము కాటు: ఆసుపత్రిలో అడ్మిట్: హెల్త్ అప్‌డేట్ ఇదే

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారు. ఆయనకు పాము కాటు వేసింది. దీనితో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించారు. కొన్ని గంటల పాటు సల్మాన్ ఖాన్‌కు డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చారు. విషానికి విరుగుడు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ తెల్లవారు జామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఘటన..

పన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఘటన..

సల్మాన్ ఖాన్‌కు ముంబై శివార్లలోని పన్వెల్‌లో ఫామ్ హౌస్ ఉంది. లాక్‌డౌన్ సమయంలో ఆయన ఇక్కడే గడిపారు. సల్మాన్ ఖాన్ ముంబైలో ఉంటే- వీకెండ్ రోజుల్లో ఈ ఫామ్‌హౌస్‌కు తప్పనిసరిగా వెళ్తుంటారు. మూడు రోజుల పాటు అక్కడే గడుపుతారు. అనంతరం షూటింగ్స్‌లల్లో పాల్గొంటుంటారు. బిగ్‌బాస్ హిందీ సీజన్ 15 షూటింగ్ ముగించుకున్న తరువాత ఎప్పట్లాగే- ఈ శుక్రవారం రాత్రి కూడా ఆయన పన్వెల్ ఫామ్‌హౌస్‌కు వెళ్లారు.

తెల్లవారు జామున..

తెల్లవారు జామున..

అదే రోజు రాత్రి తన అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన కొన్ని స్టోరీ డిస్కషన్స్‌లో పాల్గొన్నారు. తన సన్నిహితులకు చిన్నసైజు పార్టీ ఇచ్చారు. శనివారం కూడా అక్కడే గడిపారాయన. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో పాము కాటుకు గురయ్యారు. పాము కాటు వేసిన విషయం తెలిసిన వెంటనే తన బాడీగార్డ్, కొద్దిమంది సన్నిహితులు సల్మాన్ ఖాన్‌ను నవీముంబై కామోతె ప్రాంతంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

విషపూరితమైనది కాకపోవడంతో..

విషపూరితమైనది కాకపోవడంతో..

ఆయనకు కాటు వేసిన విషపూరితమైనది కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాటు వేయడం వల్ల ఏర్పడిన గాయానికి చికిత్స చేశారు. యాంటీ వీనమ్ డోస్‌ను ఇచ్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఈ ఉదయం 9 గంటలకు డిశ్చార్జ్ చేశారు. ఫామ్ హౌస్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా ఉంటాయని, దట్టమైన చెట్లు, పొదలతో నిండివుంటాయని, తరచూ పాములు వస్తుంటాయని సిబ్బంది చెప్పారు. సల్మాన్ ఖాన్‌కు పాముకాటు వేసిన విషయం తెలిసిన వెంటనే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీస్ స్పందించారు.

సల్లూభాయ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే..

సల్లూభాయ్‌కు అడ్వాన్స్ హ్యాపీ బర్త్‌డే..

సోమవారం సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. 57వ బర్త్‌డేను ఆయన జరుపుకోనున్నారు. బిగ్‌బాస్ సీజన్ 15 వీకెండ్ ఎపిసోడ్ కావడం, బిగ్ స్టార్స్ ఒకేచోటికి చేరుకోవడంతో ఆయన అడ్వాన్స్డ్‌గా బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు. డయాస్ మీదే కేక్ కట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, ఆలియా భట్ సమక్షంలో కేక్ కట్ చేశారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌తో కలిసి డాన్స్ చేశారు. వారితో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్స్‌లో మెరుపులు మెరిపించారు.

నాచో నాచో పాటకు స్టెప్స్..

నాచో నాచో పాటకు స్టెప్స్..

నాటు నాటు పాటతో రచ్చ చేశారు. ఈ నాటు నాటు కాస్తా హిందీలో నాచో నాచోగా మారింది. రామ్‌చరణ్-ఎన్టీఆర్ ఈ పాటకు స్టెప్పులేశారనడం కంటే.. సల్మాన్‌ఖాన్‌కు ఆ స్టెప్పుల గురించి నేర్పించారనడం కరెక్ట్. బీట్‌కు అనుగుణంగా సల్మాన్ ఖాన్ స్టెప్స్ వేయలేక ఏడుపు మొఖం పెట్టేశాడు. వన్-టూ-త్రీ-ఫోర్ అంటూ స్టెప్‌ను సల్మాన్ ఖాన్‌కు నేర్పించారు. ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మీ ఇద్దరిలా నేను డాన్స్ చేసి తీరుతానంటూ సల్మాన్ ఖాన్ ప్రామిస్ చేశాడు. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఎన్టీఆర్ కౌంటర్ ఇచ్చాడు. స్టెప్స్ వేస్తోన్న సమయంలో సల్మాన్ ఖాన్ షర్ట్ బటన్ ఊడిపోగా.. దాన్ని ఆలియా భట్ వేయడం హైలైట్.

English summary
Bollywood superstar Salman Khan was taken to a Mumbai hospital at 3 AM last night after he was bitten by a snake. The actor was at his Panvel farmhouse when the incident took place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X