వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడే డ్రైవర్‌లెస్ కారుందా: సల్మాన్‌పై వ్యంగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సల్మాన్ ఖాన్‌కు 2002లోనే డ్రైవర్‌లెస్ కారు ఉందా అని అడుగుతున్నారు. హింట్ అండ్ రన్ కేసులో బొంబాయి హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో ట్విట్టర్ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.

సల్మాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయాన్ని ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌తో పెట్టగా, అది గురువారం నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ కేసు విషయంపై శుక్రవారం ఉదయం నుంచి పలువురు వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నరు.

Salman Khan hit-and-run case verdict: Twitter reactions!

గూగుల్ ఇంకా డ్రైవర్‌లెస్ కార్లను విడుదల చేయలేదని, సల్మాన్ ఖాన్‌కు మాత్రం 2002లోనే డ్రైవర్‌లెస్ కారు ఉందని కొంత మంది ట్వీట్ చేశారు. భారత్‌లో ఆటో పైలట్ కార్లు ఉన్నాయా అని మరి కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. భారత్‌లో 2002లో డ్రైవర్‌లెస్ కార్లు కనిపెట్టారని కొంత మంది వ్యాఖ్యానించారు.

సల్మాన్ ఖాన్ కారే మద్యం తాగి ఉంటుంది, అందుకే ఈ ప్రమాదం జరిగిందని మరి కొందరు వ్యాఖ్యానించారు. పేవ్‌మెంట్ మీద నిద్రపోయినప్పుడు భారత న్యాయస్థానాల్లో న్యాయం లభిస్తుందనే కల కనే ధైర్యం చేయకు అంటూ కూడా ఓ వ్యాఖ్య ఉంది.

English summary
Reactions on bombay High Court verdict on Salaman Khan's hit and run case - While well-wishers of the Prem Ratan Dhan Payo actor are elated, there are others who are questioning the law and the judiciary system; their reactions ranging from mild disapproval to disgust to ridicule...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X