వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్‌ఖాన్: ఖైదీ నెంబర్ 106, ఆశారాం బాపు సెల్ పక్కనే గది

By Narsimha
|
Google Oneindia TeluguNews

జైపూర్: కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలడంతో బాలీవుడు నటుడు సల్మాన్ ఖాన్‌ను జోథ్‌పూర్‌ సెంట్రల్‌కు తరలించారు. జైలులో సల్మాన్‌ఖాన్‌కు 106 నెంబర్‌ను కేటాయించారు. లైంగిక వేధింపులో కేసులో అరెస్టైన ఆశారాం బాపు ఉంటున్న గది పక్కనే సల్మాన్‌ఖాన్‌కు గదిని కేటాయించారు.

సినీ నటుడుగా పేరు ప్రఖ్యాతలున్న సల్మాన్‌ఖాన్‌ను సాధారణ ఖైదీలుగానే జైలులో ట్రీట్ చేస్తామని జైల్ అధికారులు ప్రకటించారు. సాధారణ ఖైదీల మాదిరిగానే జైలులో కార్యకలాపాలను సల్మాన్‌ అనుసరించాల్సి ఉంటుంది.

Salman Khan is now qaidi number 106; to spend night in Jodhpur prison

గదిలో ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు కూడా లేవు. కేవలం ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉంది. నేలపైనే సల్మాన్ నిద్రపోవాల్సి ఉంటుందని జైలు సూపరింటెండెంట్‌ విక్రమ్‌ సింగ్‌ తెలిపారు.

సల్మాన్‌కు కేటాయించిన గదిలో ఏ ఖైదీని ఉంచడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తీర్పు వెలువరించిన వెంటనే సల్మాన్‌ను కోర్టు నుంచి నేరుగా జైలుకే తరలించారు. సల్మాన్‌ ఓ నటుడు. ప్రజలు ఆయన్ను చూస్తూ ఉంటారు. అంతేకాదు.. అనుకరిస్తారు. అటువంటి వ్యక్తి ఓ అమాయక జింకను దారుణంగా వేటాడి చంపడం ఎంతమాత్రం సమంజసం కాదు' అని శిక్ష ఖరారు చేస్తూ న్యాయమూర్తి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

20ఏళ్ల నాటి ఈ కేసులో గురువారం జోధ్‌పూర్‌ న్యాయస్థానం సల్మాన్‌ను దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష, 10వేల జరిమానా విధించింది.. తీర్పు ఇచ్చిన వెంటనే సల్మాన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. 1998లో కంకణి గ్రామంలో సంచరిస్తున్న రెండు కృష్ణ జింకలపై కాల్పులు జరిపారు. దీనిపై కేసు నమోదు చేశారు. 20ఏళ్ల పాటు సాగిన ఈ కేసు తీర్పు ఎట్టకేలకు నేడు వచ్చింది.

English summary
Actor Salman Khan, convicted and sentenced to five years in prison in a blackbuck poaching case, will not receive any special treatment during his stay in jail, Jodhpur DIG (Prisons) Vikram Singh said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X