వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు: మ. 2గంటలకు తీర్పు

|
Google Oneindia TeluguNews

జోధ్‌పూర్‌: కృష్ణ జింకల కేసులో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ముగిసింది. సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్‌ జోషి బదిలీ నేపథ్యంలో తొలుత విచారణపై అనిశ్చితి నెలకొంది. కానీ, ఆయన శనివారం ఉదయం విధులకు హాజరై సల్మాన్‌ బెయిల్‌ పిటషన్‌పై విచారణ జరిపారు.

Recommended Video

కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

తీర్పు మధ్యాహ్నం భోజన విరామం‌ తర్వాత వెల్లడించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కాగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని ప్రాసిక్యూషన్‌ కోరింది. రెండు కృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో సల్మాన్‌ఖాన్‌కు గురువారం ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన జోధ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో ఉన్నారు.

 Salman Khans bail plea: Arguments in court over, order likely after 2 pm

బెయిల్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉండగా సల్మాన్‌కు బెయిల్‌ ఇవ్వాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోవడానికి కేసు పూర్తిగా పరిశీలించాల్సి ఉందని న్యాయమూర్తి జోషి శనివారానికి వాయిదా వేశారు. దీంతో గత రెండు రోజులుగా సల్మాన్‌ జైల్లోనే సాధారణ ఖైదీగా గడిపారు.

English summary
A Jodhpur Court will continue the hearing of bail plea by Bollywood actor Salman Khan, who has been sentenced to five years in prison for killing two blackbucks in 1998, today (April 7). Salman Khan's lawyer had filed the bail application in the court on Friday (April 6).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X