వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కపిల్ సిబాల్‌పై సల్మాన్ ఖుర్షీద్ కస్సు బుస్సు.. సొంత పార్టీపై విమర్శలు సరికాదు..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కుంపటి పెట్టాయి. పార్టీ ప్రభావంపై సీనియర్ నేత కపిల్ సిబాల్ నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ కౌంటర్ ఇచ్చారు. విమర్శకులను 'డౌటింగ్ థామసెస్' అంటూ దుయ్యబట్టారు. నియమిత కాలం ప్రకారం ఆవేదన కలుగుతుందన్నారు. ఫేస్‌బుక్ పోస్ట్‌ను ఖుర్షీద్ ఉర్దూతో ప్రారంభించారు. మొఘల్ సామ్రాజ్య అధిపతి బహదూర్ షా జఫార్ గురించి ప్రస్తావించారు. ఇదీ కేవలం లోపాలను వెతకడం గురించి మాత్రమే మాట్లాడుతుందని చెప్పారు. జాఫర్ ఆనాడు చెప్పిన మాటలు అనుచరుల్లో ధైర్యం నింపాయని గుర్తుచేశారు.

ఆర్జేడీతో పోల్చుకుంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తీవ్రమైన పరాభవాన్ని రుచి చూసింది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు కొందరు పార్టీని ప్రక్షాళన చేయాలని, అంతర్మథనం చేయాలని చెప్తున్నారు. కపిల్ సిబల్ కూడా ఆత్మావలోకనం చేసుకోవాలని చెప్పారు. బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నేత తారిక్ అన్వర్ కూడా పార్టీలో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు.

Salman Khurshid slams Congress colleagues for periodic pangs of anxiety

కాంగ్రెస్ ప్రవచించే ఉదారవాద విలువలకు ఓటర్లు వ్యతిరేకంగా ఉంటే, అధికారంలోకి రావడానికి దగ్గరి దారులను వెతకడానికి బదులుగా, దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధపడాలని సల్మాన్ ఖుర్షీద్ అభిప్రాయపడ్డారు. అనుకున్నదాని కన్నా తక్కువ ఫలితాలు సాధిస్తే అసహనం ఉంటుందన్నారు.

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించిన ఇచ్చిన హామీ మేరకు నితీశ్ కుమార్‌కు సీఎం పదవీ ఇచ్చారు. కానీ బీజేపీ నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అయితే శాఖల విషయంలో కూడా నితీశ్ కుమార్ ఆచి తూచి వ్యవహరించారు. కీలకమైన హోం శాఖను తన వద్దే పెట్టుకున్నాడు.

English summary
Senior Congress leader Salman Khurshid on Tuesday slammed his party colleagues for raising questions over the party's recent poll performances after the Bihar poll debacle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X