• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూర లేదు.. ఉప్పుతో సరి.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చుక్కలు..! (VIDEO)

|
  కూర లేదు.. ఉప్పుతో సరి.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు చుక్కలు..!

  లక్నో : మధ్యాహ్న భోజన పథకం పక్కదారి పట్టిందనడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన పోషక ఆహారం అందించాలనే ఉద్దేశంలో ప్రారంభించిన మిడ్ డే మీల్ పథకం కొన్ని చోట్ల అభాసుపాలవుతోంది. కొందరి కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చేలా తయారైంది పరిస్థితి.

  ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న తీరు చర్చానీయాంశంగా మారింది. పోషకాహారం ఏమో గానీ ప్రతి నిత్యం అక్కడి విద్యార్థులకు రొట్టెలతో పాటు కూరలు ఇవ్వకుండా అనుసరిస్తున్న విధానం ఆరోపణలకు తావిస్తోంది. తాజా ఆకు కూరలు, విజిటెబుల్స్, గుడ్లు, పాలు అందించి వారిశారీరక ఎదుగుదలకు తోడ్పాటు అందించాల్సింది పోయి వారి జీవితాలలో ఆడుకుంటున్న వైనం వెలుగుచూసింది.

  salt served in the place of curry for mid-day meal in UP Mirzapur

  అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం..! (వీడియో)

  ఒక పూట అన్నం పెడుతూ మరో పూట రొట్టెలు ఇస్తున్నప్పటికీ.. కూరలు మాత్రం ఇవ్వడం లేదట. అంతేకాదు గుడ్లు, అరటిపండ్లు ఇలాంటి పోషకాహార పదార్థాలు కూడా అక్కడి సిబ్బంది స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇది ఏ ఒక్క పూటకో జరుగుతుందని భావిస్తే పొరపాటే. గతేడాది నుంచి ఇదే తంతుగా వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

  మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న తతంగం విజువల్స్‌తో సహా సదరు యువ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రభుత్వ ఉన్నతాధికారి అనురాగ్ పటేల్ స్పందించారు. విచారణ జరిపించి పాఠశాల హెడ్ మాస్టర్‌తో పాటు గ్రామ పంచాయతీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Students of a government primary school in Mirzapur district of Uttar Pradesh are being served salt and roti under the midday meal scheme. The midday meal scheme is designed to provide proper nutrition to scores of children from poor families who study in government schools across the country. A video posted on social media shows children sitting on the floor of the school corridor, eating rotis with just some salt in their plates.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more