వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్యూట్.. దీపక్ వసంత్.. ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడారు, ధైర్య సాహసాలను కీర్తిస్తోన్న ప్యాసెంజర్స్

|
Google Oneindia TeluguNews

కోజికోడ్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ వారు షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ తమను కాపాడింది మాత్రం పైలట్ దీపక్ వసంత్ సాతే అని చెబుతున్నారు. తమకు మరో జన్మను అతనే ప్రసాదించాడని.. ఆపద సమయంలో కూడా తెలివిగా వ్యవహారించి.. ప్రయాణికుల ప్రాణాల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టాడని తెలిపారు. విమానం ల్యాండయిన తర్వాత మంటలు చెలరేగకుండా నివారించి... తమ పాలిట దేవుడిలా మారాడాని కీర్తిస్తున్నారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి..

ప్రాణాలను ఫణంగా పెట్టి..

ప్రమాదం జరిగిన ప్రయాణికుల ప్రాణాల కోసం తన ప్రాణాన్ని పైలట్ ఫణంగా పెట్టారని తెలిపారు. అతను కనబరిచిన ధైర్య సాహసాలతో తాము ఊపిరి పీల్చుకుంటున్నామని పేర్కొన్నారు. దీపక్ సాతే మంచి అనుభవనం ఉన్న పైలట్.. అందుకోసమే విమానం రెండు ముక్కలైన.. భారీ ప్రాణ నష్టం కాకుండా నివారించగలిగారు.

22 ఏళ్ల అనుభవం సొంతం..

22 ఏళ్ల అనుభవం సొంతం..

దీపక్ సాతే.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఫైటర్‌గా పనిచేశారు. 59 ఏళ్ల దీపక్‌కు 22 ఏళ్ల అనుభవం ఉంది. 1981లో హైదరాబాద్ సమీపంలో గల దుండిగల్ వైమానిక దళం అకాడమీ నుంచి పట్టబద్రుడయ్యారు. ఖాడక్వాస్లలాలో పైలట్‌గా శిక్షణ కూడా తీసుకున్నారు. వైమానిక దళంలో ప్రతిభకు అందజేసే ‘స్వార్డ్ ఆఫ్ హానర్' కూడా పొందారు.

Recommended Video

Kozhikode : కేరళలో ఘోర ప్రమాదం.. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ కీలక ఆదేశాలు ! || Oneindia
రన్ వే పై నీరు.. వర్షం కురవడంతో..

రన్ వే పై నీరు.. వర్షం కురవడంతో..

అయితే శుక్రవారం రాత్రి విమానం ల్యాండయ్యే సమయంలో వర్షం కురవడం.. రన్ వేపై వర్షపు నీరు ఉండటంతో దీపక్ దానిని సరిగా అంచనా వేయలేకపోయారు. దీంతోపాటు అది హిల్ స్టేషన్‌పై ఉన్న రన్ వే కావడం కూడా ప్రతికూలంగా మారింది. వెదర్ అనుకూలించకపోవడంతో ప్రమాదం జరిగింది. రెండుసార్లు అదుపుతప్పిన సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారని.. కానీ స్కిడయ్యి రెండు ముక్కలైందని ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు ఒకరు తెలిపారు.

నోట రానీ మాట..

నోట రానీ మాట..

ప్రమాదం తర్వాత నోట మాట రాలేదని.. ఆక్సిడెంట్‌కు సంబంధించి ఏమీ గుర్తులేదని మరో ప్రయాణికుడు తెలిపారు. విమానంలో 190 మంది ఉండగా.. 123 మంది గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరికీ వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. 38 మంది కోజికోడ్ ఎంఐఎంఎస్ ఆస్పత్రి, 28 మంది బేబీ మెమోరియల్ ఆస్పత్రి, 14 మంది మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

English summary
Survivors of air india plane crash in Kerala’s Kozhikode said the aircraft’s captain Deepak, helped save their lives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X