వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: యూపి ముఖ్యమంత్రితో ములాయం చిన్న కోడలు అపర్ణయాదవ్ భేటీ, ఎందుకు?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ దంపతులు శుక్రవారం నాడు కలవడం రాజకీయంగా సంచలనం కల్గించింది. మర్యాదపూర్వకంగానే తాము మ

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ దంపతులు శుక్రవారం నాడు కలవడం రాజకీయంగా సంచలనం కల్గించింది. మర్యాదపూర్వకంగానే తాము ముఖ్యమంత్రిని కలిసినట్టుగా అపర్ణయాదవ్ దంపతులు చెబుతున్నారు.

రాజకీయాల్లో శాశ్వతశత్రువులు కాని, శాశ్వత మిత్రులు కాని ఉండరని చెబుతారు.అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ములాయం సింగ్ తో పాటు ఆయన తనయుడు మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ కూడ హజరయ్యారు.

అయితే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ స్థానం నుండి బరిలో దిగిన ములాయం సింగ్ చిన్న కోడలు అపర్ణాయాదవ్ రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలయ్యారు.

ములాయం చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణ యాదవ్, ప్రతీక్ రియల్ ఏస్టేట్ వ్యాపారంలో ఉన్నాడు.అయితే తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకురావాలని సాధనాగుప్తా భావించారు.అయితే ప్రతీక్ మాత్రం రాజకీయాలపై ఆసక్తిగా లేరు.దీంతో అపర్ణయాదవ్ రాజకీయాల్లోకి వచ్చారు.

యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం వెనుక మతలబేమిటీ?

యోగి ఆదిత్యనాథ్ తో సమావేశం వెనుక మతలబేమిటీ?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తో ములాయం సింగ్ చిన్న కొడుకు ప్రతీక్ యాదవ్, ఆయన కోడలు అపర్ణాయాదవ్ సమావేశం వెనుక ఉన్న మతలబు ఏమిటనే విషయమై రాజకీయవర్గాల్లో సర్వత్రా చర్చసాగుతోంది.ఈ విషయమై రాజకీయవర్గాల్లో పలు రకాల ఊహగానాలు విన్పిస్తున్నాయి.అయితే ముఖ్యమంత్రిగా యోగి ఆధిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనను కలవలేదని, మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా ప్రతీక్ దంపతులు చెబుతున్నారు.

వివాదాలకు కేంద్ర బిందువు అపర్ణాయాదవ్

వివాదాలకు కేంద్ర బిందువు అపర్ణాయాదవ్

ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణయాదవ్ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తారు. గత ఏడాది అక్టోబర్ మాసంలో తమ కుటుంబంలో జరిగిన వివాహ వేడుకలకు హజరైన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో అపర్ణయాదవ్ సెల్పీ దిగారు.ఈ సెల్పీ సమాజ్ వాదీ పార్టీలో పెనుదుమారానికి కారణమైంది.దీంతో ఆమె వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. ప్రధానమంత్రి కావడం వల్లే మోడీతో సెల్పీ దిగాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు. మరో వైపు ఎన్నికల సమయంలో కూడ ఆమె బిజెపి నాయకులకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలు కూడ సమాజ్ వాదీ పార్టీని ఇరకాటంలో పెట్టాయి.

కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన అపర్ణా యాదవ్

కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన అపర్ణా యాదవ్

కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసేందుకుగాను రెండేళ్ల నుండి ఆమె క్షేత్రస్థాయి నుండి ప్లాన్ చేసుకొన్నారు. స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు.అయితే ఈ స్థానం నుండి ఆమె రీటా బహుగుణ చేతిలో ఘోరమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. రీటా బహుగుణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరారు. రీటా బహుగుణ 33,796 ఓట్లతో అపర్ణయాదవ్ ను ఓడించారు.

ములాయం అభీష్టానికి వ్యతిరేకంగా

ములాయం అభీష్టానికి వ్యతిరేకంగా

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.బిజెపికి వ్యతిరేకంగా లౌకికశక్తులను కూడగట్టడంలో ఆయన ప్రధానభూమిక పోషిస్తారు. కాంగ్రెస్, బిజెపియేతర పార్టీల నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వాల్లో ములాయం కీలకంగా వ్యవహరించారు.అయితే యోగి ఆధిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంప్రదాయం కావడం వల్లే ములాయంతో పాటు ఆయన తనయుడు అఖిలేష్ పాల్గొన్నారు.అయితే అపర్ణాయాదవ్, ఆమె భర్త ప్రతీక్ యాదవ్ కలవడం ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో కలకలానికి కారణమైంది.

English summary
samaj wadi party founder mulayam singh yadav daughter in law aparna yadav met uttar pradesh chief minister yogi yogi adityanath on friday morning in vvip guest house at lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X