వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెదిరించి పనిమనిషి న్యూడ్ వీడియో తీశారు

|
Google Oneindia TeluguNews

Sambalpur couple shoots tribal maid’s nude video, faces arrest
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలోని సంబల్పూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంబల్పూర్ జిల్లాలోని బెల్హాపూర్‌లో నివాసం ముంటున్న దంపతులు తమ ఇంట్లో పనిచేస్తున్న ఓ గిరిజన యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడమే కాకుండా ఆమెను బెదిరించి నగ్నంగా వీడియో తీశారు. వేధింపుల సమాచారం అందుకున్న పోలీసులు నిందిత దంపతులను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్హాపూర్‌లోని టిఆర్ఎల్ క్రోసకి రిఫ్రాక్టరీ లిమిటెడ్ కంపెనీలో నిందితుడు ముకుల్ సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. బీహార్ రాష్ట్రానికి చెందిన అతని భార్య అర్చనతో కలిసి ముకుల్ సింగ్ బెల్హాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. వారి ఇంట్లో గిరిజన యువతి(16) గత రెండేళ్లుగా పని చేస్తోంది.

కొన్ని రోజులుగా ఆ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన దంపతులు, ఆమెను బెదిరింపులకు గురి చేసి నగ్నంగా వీడియో తీశారు. అంతేగా ఇంటిని విడిచి వెళ్లకూడదని, ఎవరికీ ఈ విషయాలను చెప్పకూడదని యువతిని శారీరకంగా హింసించారు. ఆ ఇంటి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధిత యువతి తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని తెలిపింది.

ఘటనపై ఆగ్రహానికి గురైన బాధితురాలి బంధువులు, స్థానికులు స్థానిక హైవేను దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు నిందితులైన దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బ్రజరజ్‌నగర్ ఎస్‌డిపిఓ చూడామణి నాయక్ ఆదివారం తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని, వారిని వెతికేందుకు ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

English summary
Police on Saturday raided the house of a couple at Belpahar in Sambalpur district to arrest them on charges of sexually harassing their tribal maid servant, who is a minor. The couple, however, managed to give police the slip.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X