• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జైలులో అందరూ సమానమే.. చిదంబరానికి ఇంటి భోజనానికి నిరాకరించిన హైకోర్టు

|

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహర్ జైలులో ఉన్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి మరోసారి చుక్కెదురైంది. ఇవాళ చిదంబరం తరఫున కపిల్ సిబాల్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ జస్టిస్ సురేశ్ కుమార్ .. సిబాల్ వాదనలతో వ్యతిరేకించారు. బెయిల్‌తో పాటు చిదంబరానికి ఇంటి ఆహారం ఇప్పించాలని కపిల్ సిబాల్ కోరారు.

కపిల్ సిబాల్ వాదనలతో మేజిస్ట్రేట్ విభేదించారు. జైలులో అందరికీ ఒక్కటే ఆహారమని స్పష్టంచేశారు. చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇచ్చేందుకు అంగీకరించబోమని తేల్చిచెప్పారు. చిదంబరం వయస్సు 74 ఏళ్లు అని .. ఆయనకు ఇంటి భోజనం అనుమతి ఇవ్వాలని కోరారు. అంతకుముందు చిదంబరాన్ని తీహర్ జైలుకు తరలించొద్దని కూడా కోరిన సంగతి తెలిసిందే. కానీ 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్ విధించడంతో జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆహారం గురించి సిబాల్ ప్రత్యేకంగా వాదించారు.

Same food for everyone: High Court refuses home meals for Chidambaram

దీనిపై సొలిసిటల్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఇదివరకు కోల్ కతాలో ఓ రాజకీయ నేత .. చిదంబరం కంటే వృద్ధుడు అని .. కానీ అతనికి ఇంటి ఆహారం అనుమతించలేమని గుర్తుచేశారు. దీనిపై సిబాల్ కల్పించుకొన్నారు. ఆ కేసులో ముద్దాయికి ఏడేళ్ల శిక్ష విధించారనే విషయాన్ని గుర్తుచేశారు. కానీ చిదంబరానికి సంబంధించి నేరం రుజువు కాలేదన్నారు. అయితే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇప్పటికే చార్జీషీట్ దాఖలు చేశామని మెహతా వివరించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. ఇంటి భోజనం పెట్టించేందుకు అనుమతి ఇవ్వలేదు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 29 సంవత్సరాల క్రితం జరిగిన దాడి కేసులో ఆలం అనే కమ్యూనిస్టు నాయకున్ని కోర్టు నిర్దోషిగా వదిలిపెట్టింది. మమతపై దాడి కేసులో పాల్గోన్న వారు కొంతమంది మరణించగా మరికొంతమంది పరారీలో ఉన్నారు. ఇంకా కేసును కొనసాగించడం వల్ల ఎలాంటీ ప్రయోజనాలు లేవని కోర్టు భావించింది. ముఖ్యంగా కేసును అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఎలాంటీ విచారణ లేకుండా 2011 వరకు బ్లాక్‌లో పెట్టింది .దీంతో కేసు విచారణకు ఇన్ని సంవత్సరాల కాలం పట్టింది. నిర్దోషిగా విడుదలైన లాలు ఆలం కేసు ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.

కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ వారిపై అనేక పోరాటాలు చేసిన విషయం తెలిసందే.. మమతా పోరాటంతో 35 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కమ్యూనిస్టులు 2011లో మమతా చేతిలో ఓడిపోయారు. ఈనేపథ్యంలోనే ఆమే యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ఆమే పై 1990 ఆగస్టు 16 న కాలిఘాట్ నివాసం సమీపంలో హజ్రా క్రాసింగ్ వద్ద మమతాపై దాడి జరిగింది. ఆమే తలపై కర్రలతో దాడి చేయడంతో తల పగిలిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసు సంచలనంగా మారింది. గాయాలపాలైన ఆమే కొన్ని వారాల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది.

అయితే ఆమేపై దాడి అంశాన్ని అప్పటి కమ్యూనిస్టు ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆమే తరఫు అడ్వకేట్‌లు చెప్పారు. 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విచారణ ప్రారంభమైంది. 1994 లో మమతా బెనర్జీ ఈ కేసులో సాక్షిగా అలీపూర్ కోర్టుకు కూడ వచ్చారు. కాగా ప్రస్తుతం విర్దోషిగా విడుదలైన ఆలం అనే కమ్యూనిస్టు నాయకుడు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే 2011 లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు బయపడ్డానని, అ సంధర్భంలోనే కేసుకు దాడికి సంబంధించి క్షమాపణలు కూడ చెప్పాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత కోర్టు నిర్ధోషిగా విడుదల చేయడంతో చాలా సంతోషంగా ఉందని ఆలం చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Same food is available for everyone, said the Delhi High Court on Thursday while hearing the regular bail plea filed by former finance minister P. Chidambaram, who is currently in Tihar Jail in INX Media corruption case. “Same food is available for everyone,” said Justice Suresh Kumar Kait after Chidambaram’s counsel Kapil Sibal requested the court that home cooked food be allowed to his client in jail. Responding to the court’s remark, Sibal said, “My Lords, he is 74 years old.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more