• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరోనా వైరస్ : రెండు దేశాల్లో ఒకే కథ.. భారత్,ఫిలీప్పిన్స్‌లలో డాక్టర్ల వ్యథ..

|

ప్రపంచానికి ఇది కరోనా కష్ట కాలం. వ్యాక్సిన్ లేని ఈ వైరస్‌ను నియంత్రించడమే ప్రస్తుతం అన్ని దేశాల ముందున్న సవాల్. ఇందుకోసం సామాన్యులు చేయాల్సింది ఇళ్లకే పరిమితమై స్వీయ నియంత్రణలో ఉండటం. కానీ వైద్యులు మాత్రం ప్రత్యక్ష యుద్దం చేయాల్సిందే. ఈ ఆపదకాలంలో ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ ప్రజల కోసం వారు పనిచేస్తున్నారు. కానీ ఫలితంగా వాళ్లకు దక్కుతున్నదేంటి..? రాళ్ల దాడులు.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల నుంచి వైద్యులకు సహకారం కరువై.. వారి నైతిక స్థైర్యం దెబ్బతింటే.. ఇక జనసామాన్యాన్ని కాపాడెదెవరు.. కానీ ఇవేవీ పట్టించుకోకుండా వైద్యులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క భారత్‌లోనే కాదు ఫిలిప్పీన్స్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఫిలిప్పీన్స్‌లో ఏం జరుగుతోంది..

ఫిలిప్పీన్స్‌లో ఏం జరుగుతోంది..

ఫిలిప్పీన్స్‌లో వైద్య సేవలు అందిస్తున్న నర్సులు,డాక్టర్లకు ఇంటి యజమానుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. ఇళ్లు ఖాళీ చేయాలంటూ వారు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులకు ఫోన్లు చేసిన నర్సులు,డాక్టర్లు బోరున విలపిస్తున్నారు. సెంట్రల్ ప్రావిన్స్‌లోని ఇలోయిలో సిటీలో మార్చి 21న మొదటి కరోనా మృతి కేసు తర్వాత అక్కడి డాక్టర్లకు ఈ వేధింపులు మొదలయ్యాయి. తాము ఆసుపత్రుల్లో రక్షణ సూత్రాలు పాటిస్తూనే వైద్య సేవలు అందిస్తున్నామని.. కాబట్టి ప్రమాదమేమీ లేదని వైద్యులు ఎన్ని వివరణలు ఇచ్చుకుంటున్నా.. అక్కడి ఇంటి యజమానులు వారి మాట వినడం లేదు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా సరే.. ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. సపుల్ అనే స్థానిక హెల్త్ కేర్ సిబ్బంది ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు. ఆఖరికి ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ద్య కార్మికులను సైతం ఇల్లు ఖాళీ చేయమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

డాక్టర్లు,నర్సులపై దాడులు..

డాక్టర్లు,నర్సులపై దాడులు..

ఫిలీప్పీన్స్‌లో ఇప్పుడక్కడి డాక్టర్లు తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నారు. కనీసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులోకి కూడా వారిని అనుమతించట్లేదు. ఏదైనా తినుబండారాల షాపుకు వెళ్లినా బయటకు గెంటేస్తున్నారు. ఒక షాపు యాజమాన్యమైతే.. ఇక్కడి ఆసుపత్రి వర్కర్స్ రావద్దంటూ ఏకంగా బోర్డు పెట్టేసింది. ఈ అవమానాలకు తోడు వారిపై దాడులు కూడా పెరిగిపోయాయి. గత శుక్రవారం ఓ నర్సు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమె ముఖంపై క్లోరిన్ చల్లి పారిపోయారు. మరుసటి రోజు సుల్తాన్ కుదారత్ అనే ప్రాంతంలో హెల్త్ కేర్ సిబ్బందిగా పనిచేస్తున్న ఓ వ్యక్తిపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ముఖంపై బ్లీచింగ్ పౌడర్ చల్లి పారిపోయారు. దీంతో అక్కడి నర్సులు,వైద్యులు తలకు హెల్మెట్ ధరించి బయట తిరగాల్సిన పరిస్థితి తలెత్తింది.

తక్కువ వేతనాలు.. అవమానాలకు ఓర్చి..

తక్కువ వేతనాలు.. అవమానాలకు ఓర్చి..

ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పనిచేస్తున్న ఓ నర్సు దీనిపై మాట్లాడుతూ.. తన 21 ఏళ్ల సర్వీసులో ఇలాంటి దాడులు ఎన్నడూ చూడలేదన్నారు. రోడ్డుపై నర్సులు లేదా వైద్యులు కనబడితే.. తల నుంచి పాదాల వరకు ఏదో తేడాగా చూస్తున్నారని.. దూరం దూరం జరుగుతున్నారని వాపోయారు. తక్కువ వేతనాలు చెల్లిస్తున్నా సరే.. ప్రాణాలను రిస్క్‌లో పెట్టి సేవలందిస్తుంటే.. ఇలాంటి అవమానాలకు గురికావడం తీవ్రంగా బాధిస్తోందన్నారు. ఇప్పటికీ తమకు కావాల్సిన రక్షణ దుస్తుల కోసం చాలాసార్లు ఆరోగ్యశాఖకు మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వీటన్నింటిని నిరసిస్తూ ఒకవేళ తాము సామూహికంగా వైద్య సేవలను బాయ్‌కాట్ చేస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. తమ సేవలు లేకుండా ప్రాణాలు ఎలా కాపాడుకుంటారని నిలదీశారు. ఇప్పటివరకు ఫిలిప్పీన్స్‌లో 2633 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 107 మంది మృత్యువాత పడ్డారు.

  పెదాలపై ముద్దు.. తీవ్ర విమర్శలు
  భారత్‌లోనూ ఇదే కథ..

  భారత్‌లోనూ ఇదే కథ..

  ఫిలిప్పీన్స్‌లో జరిగినట్టే ఇండియాలోనూ నర్సులు,వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నాయి. గత నెలలో ఢిల్లీలో కొంతమంది వైద్యులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా ఇంటి యజమానులు వేధించినట్టుగా కథనాలు వచ్చాయి. తాజాగా మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో కరోనా టెస్టులు చేయడానికి వెళ్లిన వైద్య సిబ్బందిపై అక్కడి ప్రజలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న గాంధీ ఆసుపత్రిలో గురువారం(ఏప్రిల్ 1) సాయంత్రం ఓ కరోనా పాజిటివ్ పేషెంట్ వైద్యులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైద్యులు అతనికి భయపడి పై అంతస్తులు తలుపులు మూసుకుని కూర్చున్నారు. నిజామాబాద్‌లోనూ ఇదే తరహాలో వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీరు అజ్ఞానులే కాదు.. మిగతా సమాజానికి కూడా ప్రమాదకారులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనా యావత్ ప్రపంచం ఆపదను ఎదుర్కొంటున్నకాలంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలను అందిస్తున్న వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడటం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Last Friday, two men on a motorcycle threw chlorine on a nurse as he made his way home through Cebu, in the central Philippines.The next day, a healthcare worker in Sultan Kudarat in the island of Mindanao reported being attacked by a group of five men who threw bleach on his face as he was crossing the street on his way to the hospital where he worked.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more