బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వామి నిత్యానంద అరెస్టుకు రంగం సిద్దం, అమిత్ షాకు తల్లి లేఖ, సీబీఐతో!

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: బెంగళూరు నగరం సమీపంలోని బిడిదిలోని ధ్యానపీఠ ఆశ్రమం నిర్వహిస్తూ తనకు తానుగా ధైవ మానవుడు అంటూ ప్రచారం చేసుకున్న నిత్యానందకు సినిమా కష్టాలు ఎదురైనాయి. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన బీసీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసులో విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను భారత్ రప్పించి అరెస్టు చెయ్యాలని మృతురాలి తల్లి, నిత్యానంద ఆశ్రమయంలో లైంగిక వేధింపులకు గురైన ఆర్తిరావ్ కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను అరెస్టు చెయ్యడానికి రంగం సిద్దం అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఒన్ సైడ్ లవ్, యువతికి లైంగిక వేధింపులు, కసితీరా కత్తితో పొడిచి హత్య, చెన్నైలో ఆంధ్రా యువకుడు!ఒన్ సైడ్ లవ్, యువతికి లైంగిక వేధింపులు, కసితీరా కత్తితో పొడిచి హత్య, చెన్నైలో ఆంధ్రా యువకుడు!

 బీసీఏ పట్టభద్రురాలు

బీసీఏ పట్టభద్రురాలు

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలోని నవలూరు మేలవీధిలో నివాసం ఉంటున్న అర్జునన్ రావ్, ఝాన్సీరాణి (55) దంపతులకు ముగ్గరు కుమార్తెలు ఉన్నారు. అర్జునన్, ఝాన్సీరాణి మూడో కుమార్తె సంగీత ప్రముఖ కాలేజ్ లో బీసీఏ విద్యాభ్యాసం పూర్తి చేసింది.

నిత్యానంద ఆశ్రమంలో!

నిత్యానంద ఆశ్రమంలో!

బీసీఏ పూర్తి చేసిన సంగీత చెన్నై, బెంగళూరు శివార్లలోని నిత్యానంద ఆశ్రమంలో జరిగే ప్రత్యేక తరగతులకు హాజరు కావడానికి వెళ్లి వస్తూ ఆయన భక్తురాలు అయ్యింది. నిత్యానంద ఆశ్రమంలోని ఆయన శిష్యుడు ప్రాణానంద 2014 డిసెంబర్ 28వ తేదీన సంగీత తల్లి ఝాన్సీరాణికి ఫోన్ చేశాడు. మీ కుమార్తె సంగీత గుండెపోటుతో మరణించిదని, వచ్చి మృతదేహం తీసుకెళ్లాలని ఝాన్సీరాణికి ఫోన్ లో చెప్పాడు.

నిత్యానంద మీద పోలీసు కేసు

నిత్యానంద మీద పోలీసు కేసు

తన కుమార్తె సంగీత మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపి తనకు న్యాయం చెయ్యాలని ఝాన్సీరాణి బెంగళూరు నగర శివార్లలోని రామనగర పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో సంగీత అనుమానాస్పద మృతిపై రామనగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు.

అమిత్ షాకు లేఖ

అమిత్ షాకు లేఖ

సంగీత మృతిపై ఆమె తల్లి ఝాన్సీరాణి అనుమానం వ్యక్తం చెయ్యడంతో 2015లో తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన డాక్టర్ శరవణ సంగీత మృతదేహానికి రీపోస్టుమార్టుం నిర్వహించారు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకున్న నిత్యానందను భారత్ రప్పించి అరెస్టు చేసి తమకు న్యాయం చెయ్యాలని సంగీత తల్లి ఝాన్సీరాణి, నిత్యానంద ఆశ్రమంలో లైంగిక వేధింపులకు గురైన ఆర్తిరావ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.

సీబీఐ విచారణ!

సీబీఐ విచారణ!

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసిన విషయంపై సంగీత తల్లి ఝాన్సీరాణి తిరుచ్చిలో మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె అనుమానాస్పద మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అమిత్ షాకు మనవి చేశామని అన్నారు. సీబీఐతో విచారణ జరిపించి నిత్యానందతో పాటు ఆయన శిష్యులను కఠినంగా శిక్షించినప్పుడే తన కుమార్తె సంగీత ఆత్మకు శాంతిచేకూరుతుందన ఝాన్సీరాణి అన్నారు. మొత్తం మీద నిత్యానందను ఇదే కేసులో భారత్ రప్పించి కచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

English summary
Samiyar Nithyanandas Ashram issue: Tamil Nadu Trichy devotee Sangeetha murder case issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X