వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూఇయర్‌లోకి తొలుత అడుగుపెట్టేది న్యూజిలాండ్ కాదు.. మరి ఏదేశమో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచ దేశాలు ఇప్పటికే న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉండటం వల్ల ఆయా దేశాలు మనకంటే ముందుగానే న్యూఇయర్‌కు స్వాగతం పలకనున్నాయి. అయితే ముందుగా ఏదేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుందో తెలుసుకుందాం...

 న్యూఇయర్‌లోకి తొలుత అడుగుపెట్టేది సమోవా దేశం

న్యూఇయర్‌లోకి తొలుత అడుగుపెట్టేది సమోవా దేశం

సాధారణంగా ఆస్ట్రేలియా సిడ్నీ హార్బర్‌పై బాణా సంచా పేలగానే కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయని, నూతన సంవత్సర వేడుకలను తొలుత జరుపుకునే దేశం ఆస్ట్రేలియా అని చాలా మంది భావిస్తారు. కానీ వాస్తవానికి కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే తొలి దేశం ఆస్ట్రేలియా కాదు. పసిఫిక్ ద్వీపంలోని సమోవా దేశం అన్ని దేశాలకంటే ముందుగా న్యూఇయర్‌లోకి అడుగుపెడుతుంది. ఆ తర్వాత కొన్ని క్షణాలకు టోంటా, కిరిబాటి దీవుల్లో సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. అనంతరం న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలు కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెబుతాయి.ఆ తర్వాత సన్‌రైజింగ్ కంట్రీగా పిలువబడే జపాన్, తర్వాత సౌత్ కొరియాలు కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతాయి.

చివరిగా అడుగుపెట్టేది బేకర్ ఐలాండ్

చివరిగా అడుగుపెట్టేది బేకర్ ఐలాండ్

ఇక ప్రపంచం మొత్తం న్యూఇయర్‌కు స్వాగతం పలికిన తర్వాత చివరిగా అమెరికాలోని చిన్న ద్వీపం స్వాగతం పలుకుతుంది. ఈ దీవుల పేర్లు బేకర్ ఐలాండ్ మరియు హౌలాండ్ ఐలాండ్. ఈ రెండు దీవులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడంలో చివరిగా నిలుస్తాయి. ఇక కొన్ని దేశాలు అక్కడక్కడే ఉండటం వల్ల ఎవరైనా సరే ఒక దేశంలో న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకుని వెంటనే విమానంలో బయలుదేరితే మరో దేశంలో రెండోసారి న్యూఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

 ఎనిమిదిన్నర గంటల తర్వాత భారత్ అడుగుపెడుతుంది

ఎనిమిదిన్నర గంటల తర్వాత భారత్ అడుగుపెడుతుంది

సమోవాలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమైన ఎనిమిదిన్నర గంటలు ముగిశాక భారత్ 2020లోకి ప్రవేశపెడుతుంది. ఇక భారత్‌కు పాకిస్తాన్‌కు అరగంట సమయం తేడా ఉన్నందున పాకిస్తాన్ మన తర్వాత న్యూఇయర్ వేడుకలు జరుపుకుంటుంది. ఇక మన పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లు మనకంటే అరగంట ముందే నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతాయి.

 రష్యాలో రెండు సార్లు జరిగే కొత్త సంవత్సరపు వేడుకలు

రష్యాలో రెండు సార్లు జరిగే కొత్త సంవత్సరపు వేడుకలు

ఇక కొన్ని దేశాల్లో మాత్రం జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరగవు. అవి వారి క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటాయి. ఇలా జనవరి 1న న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకోని దేశాల్లో చైనా, సౌదీ అరేబియా, ఇజ్రాయిల్, వియత్నాం దేశాలు ఉన్నాయి. ఇక రష్యా మాత్రం రెండు సార్లు న్యూఇయర్ వేడుకలను జరుపుకుంటుంది. ఒకటి కొత్త క్యాలెండర్ ప్రకారం జనవరి 1నే సెలబ్రేట్ చేసుకోనుండగా... పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి 14న వేడుకలను నిర్వహిస్తుంది.

English summary
The Pacific island of Tonga will ring in the Year at 10am GMT on December 31 - making the tiny island nation the first to head into a fresh year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X