వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:సమోస, గుట్కా, పిజ్జా, పాన్, ఐస్‌క్రీమ్.. యూపీ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ల మోత...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రళయ విలయం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఉత్తరప్రదేశ్ అధికారులు హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు. 1076 నంబర్‌కు ఫోన్ చేసి వైద్య సాయం కోసం కోరాలని సూచించారు. కానీ కొందరు మాత్రం చిత్ర, విచిత్రంగా మాట్లాడుతున్నారు.

మందులు..

మందులు..

రామ్ రతన్ లాల్ అనే వ్యక్తి హై బ్లడ్ ప్రెషర్‌తో బాధపడుతున్నారు. తన మందులు అయిపోవడంతో ఫోన్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేశారు. వెంటనే కంట్రోల్ రూం అధికారులు స్పందించి.. మందులను పంపించే ఏర్పాట్లు చేశారు. గౌతమ్ బుద్ద్ నగర్‌కి చెందిన శంకర్ సింగ్ కూడా ఆహార పదార్థాల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేశారు. వీరిలాగే లక్ష మంది వరకు సీఎం హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశారు.

రసగుల్లా..

రసగుల్లా..

అయితే మరికొందరు మాత్రం విచిత్రమైన కోరికలు కోరుతున్నారు. ఓ వృద్దుడు తనకు రసగుల్లా కావాలని రిక్వెస్ట్ చేశాడు. వాస్తవానికి అది ఫేక్ కాల్ అని భావించారు.. కానీ లక్నో హజరత్ గంజ్‌కి చెందిన 80 ఏళ్ల వృద్దుడికి స్వీట్లు అవసరం ఉన్నాయని తెలిపింది. అతను డయాబెటిస్ అని.. అతని శరీరంలో షుగర్ స్థాయి పడిపోవడంతో స్వీట్ ఆర్డర్ చేశాడని తెలిసింది.

గుట్కా, సమోస

గుట్కా, సమోస

పోలీసు హెల్ప్ లైన్ నంబర్ 112కు చాలామంది ఫోన్ చేసి గుట్కా, చట్నీతో సమోస ఆర్డర్ చేశారు. అతని కోరిక మేరకు సమోసలు కూడా అందజేశారు. రాంపూర్‌లో ఒకరు తమకు పిజ్జా కావాలని కోరారు. ఇలా రకరకాల వస్తువులు కావాలని ఫోన్ చేస్తున్నారు. మరికొందరు ఔత్సాహికులు ముందుకొచ్చి మందు కావాలని కూడా అడగడం విశేషం. చిన్నారులు చిప్స్, కేక్స్, ఐస్ క్రీమ్, పిజ్జాలు కావాలని అడుగుతున్నారు.

ఫుడ్..

ఫుడ్..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు ఉండటంతో యూపీలో 35 వేల మంది పోలీసు రెస్పాన్స్ వెహికిల్ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. హెల్ప్ లైన్ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి ఆహార పదార్థాలు, మందులు అందజేసే బాధ్యత అప్పగించారు.

Recommended Video

Fake News Buster : 08 80 మంది రేడియో జాకీల జాబ్స్ తీసేసిన FM గోల్డ్ ?

English summary
Uttar Pradesh’s police helpline recently got a strange call when an elderly person made an “urgent request” for rasogullas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X