వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా హెల్ప్ లైన్ కి సమోసా ఆర్డర్ .. సమోసా ఇచ్చి సఫాయి పని చేయించిన అధికారులు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక ప్రజలను కేవలం నిత్యావసరాల కోసమే బయటకు అనుమతిస్తున్నాయి. కొన్ని చోట్ల కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటె అక్కడ ప్రజలకు తామే కావలసిన నిత్యావసరాలు తెచ్చి ఇస్తామని చెప్తున్నాయి. ఇక ప్రజల కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి సేవలను అందిస్తున్నాయి . అయితే కొందరు ఆకతాయిలు మాత్రం వీటిని దుర్వినియోగం చేస్తున్నారు. కరోనా హెల్ప్ లైన్ కు కాల్ చేసి ఏది పడితే అది చెప్తున్నారు.

అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటుచేసుకుంది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌కు రాంపూర్‌కు చెందిన ఓ వ్యక్తి పదేపదే ఫోన్‌ చేసి నాలుగు సమోసాలు తెమ్మని ఆర్డర్ చేశారు.

Samosa Order to Corona Helpline ... Officers gave samosas and punished

ఇది అత్యవసరాలకు ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ అని చెప్పినప్పటికీ సదరు వ్యక్తి సమోసాలు కావాలని డిమాండ్‌ చేశాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతడికి సమోసాలు అందజేయడమే కాకుండా తమ విధులకు ఆటంకం కలిగించినందుకు అక్కడి మరుగుదొడ్లు, డ్రైనేజీలు శుభ్రం చేయాలనే సామాజిక శిక్ష విధించినట్లు కలెక్టర్‌ తెలిపారు.

అంతే కాక కలెక్టర్ దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసాడు. ఇలాంటి కీలక సమయంలో ప్రజల కోసం తగిన సేవలు అందించడానికి ఉన్న తమ అమూల్యమైన సమయాన్ని ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోన్ కాల్స్ తో వృధా చేస్తే ఫలితం ఇలానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారితో దేశం విలవిలలాడుతుంటే సమోసాల కోసం డిమాండ్ చేసిన వ్యక్తికి సఫాయి పని అప్పగించి అధికారులు మంచి పనే చేశారని ఈ విషయం తెలిసిన వారంతా చెప్పుకుంటున్నారు.

English summary
One person repeatedly phoned the helpline set up for the corona victims in Rampur, Uttar Pradesh, and ordered four samosas. Although it is said to be a helpline for emergencies, the person demanded samosas. The collector said that he was given samosas for not listening to him and was sentenced to clean up the toilets and drainage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X