వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెజాన్‌లో ‘శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్’.. మొబైల్ ఫోన్లపై భారీ రాయితీలు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డిసెంబరు 12న మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు 'శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్' నిర్వహిస్తోంది. ఈ సేల్ లో శాంసంగ్ మొబైల్ ఫోన్లపై భారీ రాయితీలను ప్రకటించింది.
శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో, గెలాక్సీ ఆన్ 7 ప్రో వంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్‌తోపాటు అదనంగా రూ.6,700 వరకు తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో (6జీబీ) అసలు ధర రూ.34 వేలుకాగా, అమెజాన్‌లో 12 శాతం తగ్గింపుతో రూ.29,900కే అందజేస్తోంది.

అలాగే గెలాక్సీ ఏ5(2017) 3జీబీ 32జీబీ వేరియంట్ ధరను రూ.17,990కి తగ్గించింది. దీని అసలు ధర రూ.24,500. వీటితోపాటు శాంసంగ్ ఆన్ 8ను రూ.11,590కి, గెలాక్సీ జే5(2016)ను రూ.9,190కి అందుబాటులో ఉంచింది. ఇక గెలాక్సీ నోట్ 8ని రూ.67,900కే అందిస్తోంది.