వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాంసంగ్‌కు షాక్: టిమ్‌కుక్ భారత పర్యటనలో ఆసక్తికరం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ల వ్యాపారంలో తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న శాంసంగ్, యాపిల్ కంపెనీల మధ్య ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శాంసంగ్ కంపెనీలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ మీడియా విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న రాజీవ్ మిశ్రాను యాపిల్ కంపెనీ నియమించుకుంది.

మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న రాజీవ్ మిశ్రాను యాపిల్ ఇండియా మీడియా అండ్ పబ్లిక్ ఎఫైర్స్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాన్ని రాజీవ్ మిశ్రా సైతం మీడియాకు బుధవారం ధృవీకరించారు. ఈ నియామకం యాపిల్ సీఈఓ టిమ్ కుక్ నాలుగు రోజుల పర్యటనలో చోటు చేసుకోవడం విశేషం.

ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఇదొక శుభపరిమాణంగా భావిస్తున్నారు. లోక్‌సభ టీవీకి సీఈఓగా పనిచేసిన మిశ్రాకు మీడియా రంగంలో 22 ఏళ్ల అపార అనుభవం ఉంది. అంతకముందు హిందూస్తాన్ టైమ్స్ గ్రూప్, స్టార్ TV, జీ టీవీ, రిలయన్స్ ఇన్ఫోకాం లిమిటెడ్, న్యూస్ 24 తదితర జాతీయ ఛానల్స్‌కు పనిచేశారు.

Samsung top executive to be Apple India media head

2014లో శాంసంగ్ కంపెనీలో చేరిన రాజీవ్ మిశ్రా వివిధ మంత్రిత్వ, మీడియా సలహా విభాగాలకు నామినేటెడ్ సభ్యుడిగా ఉన్నారు. దీంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా రేటింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఆద్యుడు ఈయనే. శాంసంగ్ అమ్మకాలు దేశ వ్యాప్తంగా ఒక్కసారి ఊపందుకునేలా చేయడంతో మిశ్రా కీలకపాత్ర పోషించారు.

అసోసియేషన్ ఆఫ్ రేడియో ఆపరేటర్స్ ఫర్ ఇండియా (ఏఆర్ఓఐ)కు మొట్టమొదటి ప్రెసిడెంట్‌గా మిశ్రా ఉన్నారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కంపెనీ సీఈఓ వరుసగా చైనా, భారత్‌లలో పర్యటిస్తున్నారు. తద్వారా పడిపోయిన యాపిల్ మార్కెట్‌ను తిరిగి పునరుద్ధరించుకోనున్నారు.

English summary
In a key development, US tech giant Apple is all set to hire Rajiv Mishra, currently vice president of media and corporate social responsibility division at Samsung Electronics Co. Ltd, as its India head of media and public affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X