బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Extra madam: జైలు నుంచి విడుదలైన వెంటనే ఎక్స్‌ట్రాలు, ప్రెస్ మీట్ పెట్టి గుట్టు విప్పుతా, వామ్మో, కథ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి నాలుగు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ రాణిగి ద్వివేది ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన రాగిణి ద్వివేది చాలా ఎక్ట్ర్సాలు చేస్తోందని అంటున్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తోందని నా విషయంలో రుజువు అయ్యిందని రాగిణి భారీ డైలాగులు వేసింది. నేను జైలుకు వెళ్లడానికి కారణం ఏమిటి, నాకు ఈ ఖర్మ పట్టడానికి ఏమిటి కారణం అనే విషయం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతానని, అంత సామాన్యంగా వదిలేది లేదని రాగిణి పరోక్షంగా ఆమె జైలుకు వెళ్లడానికి కారణం అయిన వారికి వార్నింగ్ ఇచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే రాగిణి చాలా ఎక్ట్ర్సాలు చేస్తోందని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి.

Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!Massage: యాపిల్ పండ్లు లాంటి అమ్మాయిలు, మసాజ్ తో మస్త్ మజా, దెబ్బకు దూల, దెయ్యం దిగిపోయింది!

 సెంట్రల్ జైల్లో రామభజన

సెంట్రల్ జైల్లో రామభజన

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్, బహుబాష నటి రాగిణి అలియాస్ రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు అయ్యింది. సుమారు 144 రోజుల పాటు జైలు జీవితం గడిపిని ఈ ముద్దుగుమ్మ జైలు నుంచి విడుదల అవుతోంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు రాగిణికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించాయి. చివరికి సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేసిన రాగిణి చివరికి షరతులతో బెయిల్ తీసుకుంది. రాగిణి బెయిల్ రావడంతో ఆమె కుటుంబ సభ్యులతో పాటు ఆమె అభిమానులు కొంచెం ఊపిరిపీల్చుకున్నారు.

 జీవితంలో మరిచిపోలేదు

జీవితంలో మరిచిపోలేదు

సెప్టెంబర్ 4వ తేదీని రాగిణి ఆమె జీవితంలో మరిచిపోలేదు. బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో బహుబాష నటి, స్యాండిల్ వుడ్ హనీబేబి రాగిణిని గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగర శివార్లలోని యలహంకలోని రాగిణి ఇంటిలో సోదాలు చేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమె మొబైల్ ఫోన్ లు సీజ్ చేశారు. రాగిణి బెడ్ రూమ్ లో పోలీసులు గంజాయితో నింపిన సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 అక్కడే కాలం గడిపేసింది

అక్కడే కాలం గడిపేసింది

నేను ఏ తప్పు చెయ్యలేదు, తనకు ఏపాపం తెలీదని, ఈ డ్రగ్స్ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, నాకు బెయిల్ ఇవ్వండి అంటూ రాగిణి కోర్టును ఆశ్రయించింది. అయితే రాగిణికి డ్రగ్స్ కేసుతో పక్కా సంబంధం ఉందని, బెయిల్ ఇవ్వకూడదని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బెంగళూరు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. రాగిణికి బెయిల్ ఇవ్వడానికి ప్రత్యేక కోర్టులు, కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అప్పటి నుంచి రాగిణ ద్వివేది బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కాలం గడిపేస్తూ వచ్చింది.

 రాగిణికి ఆరోగ్యం బాగాలేదు

రాగిణికి ఆరోగ్యం బాగాలేదు

బెంగళూరు సీసీబీ పోలీసుల విచారణ పూర్తి అయ్యిందని, రాగిణి అనారోగ్యంతో బాధపడుతోందని, కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చెయ్యాలని, ఆమెకు బెయిల్ మంజూరు చెయ్యాలని, పోలీసుల విచారణకు రాగిణి పూర్తిగా సహకరిస్తుందని ఆమె న్యాయవాది సిద్దార్థ లూత్రా సుప్రీం కోర్టుకు మనవి చేశారు.సుప్రీం కోర్టులో అనేకసార్లు వాదనలు జరిగాయి. చివరికి నటి రాగిణికి సుప్రీం కోర్టులో షరతులతో బెయిల్ మంజూరు అయ్యింది.

 గ్రహాలు అనుకూలించలేదు

గ్రహాలు అనుకూలించలేదు

గత గురువారం సుప్రీం కోర్టులో రాగిణి ద్వివేదికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే సుప్రీం కోర్టు మంజూరు చేసిన బెయిల్ పేపర్లు బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరుకోవడం ఆలస్యం అయ్యింది. జనవరి 25వ తేదీ సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు రాగిణి బెయిల్ పేపర్లు పరిశీలించారు. చివరికి సోమవారం రాత్రి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి రాగిణి ద్వివేది విడుదల అయ్యింది.

 దేవుడి దర్శనం

దేవుడి దర్శనం

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి నాలుగు నెలలకు పైగా జైలు జీవితం గడిపిన స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ రాణిగి ద్వివేది సోమవారం రాత్రి ఎట్టకేలకు జైలు నుంచి బయటకు వచ్చారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు సమీపంలోని జడే మునేశ్వరిస్వామి ఆలయంలో రాగిణి ద్వివేది ప్రత్యేక పూజలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన రాగిణి ద్వివేది చాలా ఎక్ట్ర్సాలు చేస్తోందని అంటున్నారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తోందని నా విషయంలో రుజువు అయ్యిందని రాగిణి భారీ డైలాగ్ వేసింది.

 ప్రెస్ మీట్ పేరుతో వార్నింగ్

ప్రెస్ మీట్ పేరుతో వార్నింగ్

నేను జైలుకు వెళ్లడానికి కారణం ఏమిటి ?, నాకు ఈ ఖర్మ పట్టడానికి కారణం ఏమిటి ? దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది, ఆ కారణాలు మొత్తం తాను ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతానని, అంత సామాన్యంగా ఎవ్వరినీ వదిలేది లేదని రాగిణి పరోక్షంగా ఆమె జైలుకు వెళ్లడానికి వార్నింగ్ ఇచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే రాగిణి చాలా ఎక్ట్ర్సాలు చేస్తోందని స్యాండిల్ వుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే రాగిణి ద్వివేది ఎవరికి వార్నింగ్ ఇచ్చింది ?, ఆ వ్యక్తులు ఎవరు ? అనే విషయం మాత్రం అంతుచిక్కడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Sandalwood drugs case: Actress Ragini Dwivedi Released From Bengaluru Parappana Agrahara Jail after 144 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X