• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Fraud love: ఆమె సినిమా డైరెక్టర్, ఫేస్ బుక్ లో మైనే ప్యార్ కియా, మామిడికాయ చేతిలో పెట్టి మాయం !

|

బెంగళూరు: ఆమె సినిమాల సహాయ దర్శకురాలు, ఏ సినిమా ఏ సీన్ ఎలా పండించాలో ఆమెకు చాలాబాగా తెలుసు. అయితే ఓ మయలోడు ఆ అమ్మాయిని ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుని ప్రేమ, పెళ్లి మైనే ప్యార్ కియా అంటూ నమ్మించి లక్షల రూపాయలు లాక్కొన్నాడు. తీరా పెళ్లి విషయం ఎత్తితే ఆమె చేతిలో మామిడికాయ పెట్టి మొబైల్ స్వీచ్ ఆఫ్ చేసుకుని మాయం అయ్యాడు. ఎంతో మంది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆ సహాయ దర్శకురాలికే సినిమా చేపించి జెండా ఎత్తేసిన కేటుగాడి కోసం కరోనా, లాక్ డౌన్ కష్టకాలంలో పోలీసులు గాలిస్తున్నారు.

ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనావైరస్‌కు చికిత్స అందించే హాస్పిటల్స్ ఇవే..!

Coronavirus: క్వారంటైన్ లో ప్రియుడితో లేడీ పోలీసు జల్సాలు, ప్రియుడి భార్య ఎంట్రీ, కిలాడీ ప్లాన్!

 స్యాండిల్ వుడ్ సహాయ దర్శకురాలు

స్యాండిల్ వుడ్ సహాయ దర్శకురాలు

బెంగళూరు నగరంలోని మారుతినగర్ లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల యువతి చాలా అందంగా ఉంటోంది. సినిమాల మీద ఆసక్తితో ఆ రంగంలోకి ప్రవేశించింది. స్యాండిల్ వుడ్ లోని ప్రముఖ దర్శకుడి దగ్గర ఆమె సహాయ దర్శకురాలిగా పని చేస్తోంది. సహాయ దర్శకురాలిగా మంచి అవకాశాలు రావడంతో ఆమె తన ప్రతిభను చాటుకుంటూ సొంతంగా సినిమా దర్శకురాలు కావాలని ప్రయత్నాలు చేస్తోంది.

 ఫేస్ బుక్ లో మైనే ప్యార్ కియా

ఫేస్ బుక్ లో మైనే ప్యార్ కియా

స్యాండిల్ వుడ్ సినీ రంగంలో బిజీగా ఉంటున్న ఆమెకు 2018లో ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఇద్దరు పిచ్చపాటిగా చాటింగ్ చేసుకున్నారు. ఓ రోజు మంచి ముహూర్తం చూసి ఇద్దరు కలిశారు. తరువాత ప్రేమ పేరుతో ఆ సహాయ దర్శకురాలిని మైనే ప్యార్ కియా అంటూ ఆ యువకుడు ముగ్గులోకి దించాడు.

 కేటుగాడికి డబుల్ ఢమాకా

కేటుగాడికి డబుల్ ఢమాకా

ప్రేమ పేరుతో ముగ్గులోకి దించిన సహాయ దర్శకురాలిని పెళ్లి చేసుకుంటానని శారీరకంగా దగ్గర అయ్యాడు. యువతితో ఎంజాయ్ చేస్తున్న కేటుగాడు తన అవసరాల కోసం యువతి దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఇలా చిక్కిందే చాన్స్ అంటూ యువతిని నిలువునా దోచుకున్న ఆ యువకుడు డబుల్ ఢమాకా అంటూ జల్సాలు చేస్తున్నాడు.

 ఆ ఒక్కటిఅడక్కు

ఆ ఒక్కటిఅడక్కు

ఎంతకాలం ఇలా సహజీవనం చేస్తామని, త్వరగా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లు అవుదామని సహాయ దర్శకురాలు ప్రియుడి మీద ఒత్తిడి చేసింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి చెయ్యడం మొదలుపెట్టిందో అప్పుడు అతని అసలు స్వరూపం చూపించాడు. మన ప్రేమ విషయం బయటకు చెబితే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆ యువకుడు ప్రియురాలిని బెదిరించడం మొదలుపెట్టాడు. విషయం బయటకు చెబితే ఎక్కడ తన ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడో అని, తరువాత తనకే సమస్యలు ఎదురౌతాయని ఆ యువతి చాలా కాలం ఎవ్వరికీ విషయం చెప్పకుండా సైలెంట్ గా ఉండిపోయింది.

 నీ ముఖాన ఎన్ని లక్షలు తగలేయ్యాలి ?

నీ ముఖాన ఎన్ని లక్షలు తగలేయ్యాలి ?

త్వరలో పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు ప్రియురాలితో కలిసి బెంగళూరు నగర శివార్లలోని సోణ్ణేనహళ్ళిలో అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. ఇదే ఏడాది జనవరిలో తనకు అత్యవసరంగా రూ. 5 లక్షలు కావాలని, తన కష్టం తీరిపోయిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రియురాలికి చెప్పాడు. ఇప్పటికే నీ ముఖాన లక్షల రూపాయలు తగలేశానని ,ఇంకా తాను ఎక్కడి నుంచి రూ. 5 లక్షలు తెచ్చివ్వాలని, నేను ఇవ్వలేనని ప్రియురాలు తేల్చి చెప్పింది. అయితే నిన్ను పెళ్లి చేసుకోనని, మా అమ్మానాన్న చెప్పిన చోట పెళ్లి చేసుకుంటానని ప్రియురాలిని ఆ కేటుగాడు బెదిరించాడు.

  #Lockdown : దేశంలో పెరుగుతున్న Corona కేసులు.. ఒక్కరోజే 30వేలు, మళ్లీ Lockdown దిశగా రాష్ట్రాలు..!
   మామిడికాయ చేతిలో పెట్టి మాయం

  మామిడికాయ చేతిలో పెట్టి మాయం

  రూ. 5 లక్షలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రియురాలికి కనపడకుండా ఆ ప్రియుడు ఆమె చేతిలో మామడికాయ పెట్టి మాయం అయ్యాడు. ఐదు నెలలు అయినా ప్రియుడు ఆచూకి లేకపోవడం, అతని మొబైల్ స్వీచ్ ఆఫ్ కావడంతో యువతి బెంగళూరులోని బసవనగుడి మహిళా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అసలే కరోనా వైరస్, లాక్ డౌన్ కష్టకాలంలో అసిస్టెంట్ లేడీ డైరెక్టర్ కేసు పెట్టడంతో మాయం అయిన కేటుగాడి కోసం బసవనగుడి మహిళా పోలీసులు గాలిస్తున్నారు.

  English summary
  Fraud love: Sandalwood assistant director has complaints police against her boyfriend in Bengaluru in Karnataka.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X