వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ టూర్ ఎఫెక్ట్: ఏడాది పసికందుతో విధులకు: ఆరోగ్యం బాగాలేకున్నా: మహిళా కానిస్టేబుల్ సాహసం

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం అమెరికా. అలాంటి అగ్రరాజ్యానికి అధ్యక్ష స్థానంలో ఉన్న నాయకుడి మరో దేశ పర్యటనకు వెళ్తున్నారంటే మాటలు కాదు. రాజు వెడలె.. అనే తరహాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో..వాటన్నింటి కంటే ఓ అడుగు ముందే ఉండాల్సి ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా అప్రమత్తం కావాల్సిన పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Recommended Video

Watch: Mother And Cop At A Time! | Lady Constable Performs Duties With 1 Year Kid | Oneindia Telugu

ట్రంప్ కోసం తెలంగాణ వంటకాలు..! మూడు ఐటెమ్స్ తో కిట్ సిద్దం చేయిస్తున్న కేసీఆర్..!!ట్రంప్ కోసం తెలంగాణ వంటకాలు..! మూడు ఐటెమ్స్ తో కిట్ సిద్దం చేయిస్తున్న కేసీఆర్..!!

కనివినీ ఎరుగని భద్రత..

ఎలాంటి అనుకోని సంఘటన చోటు చేసుకున్నా.. దాని తాలూకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే విషయం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. అగ్రరాజ్యం ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాలు వేలెత్తి చూపాల్సిన దుస్థితిని కొని తెచ్చుకున్నట్టవుతుంది. ఇవన్నీ తెలిసినందు వల్లే భారత్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్ పర్యటనకు కనీవినీ ఎరుగని విధంగా భద్రతను ఏర్పాటు చేసింది.

కానిస్టేబుళ్ల సెలవులు రద్దు..

అహ్మదాబాద్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలో ఏ ఒక్క కానిస్టేబుల్‌కు కూడా సెలవులను ఇవ్వలేదు అధికారులు. ఇచ్చిన సెలవులను కూడా రద్దు చేసేశారు. ప్రతి ఒక్కర్నీ విధుల్లో నియమించారు. డొనాల్డ్ ట్రంప్-నరేంద్ర మోడీ సంయుక్తంగా నిర్వహించ తలపెట్టిన రోడ్ షో మార్గం, జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన సబర్మతి ఆశ్రమం, ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతేరా వద్ద వారిని మోహరింపజేశారు.

ఏడాది పసికందుతో విధుల్లోకి..

ఈ చర్యలు కాస్తా శృతిమించినట్టు కనిపిస్తోంది.. ఈ ఉదంతాన్ని చూస్తే!. ఓ మహిళా కానిస్టేబుల్.. తన ఏడాది పసికందుతో కలిసి విధులకు హాజరయ్యారు. అహ్మదాబాద్‌లోని విసత్ ప్రాంతంలో ఆమె భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. ఆ మహిళా కానిస్టేబుల్ పేరు సంగీత పర్మర్. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం పరిధిలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఆమె పని చేస్తున్నారు. ఏడాది కిందట ఓ మగబిడ్డకు జన్మనిచ్చారు.

అనారోగ్యంగా ఉండటంతో..

తన బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో కొంతకాలంగా ఆమె సెలవుల్లో ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా అహ్మదాబాద్ నగర పోలీసు కమిషనర్ సెలవులను రద్దు చేయడంతో సంగీత పర్మర్ తప్పనిసరి పరిస్థితుల్లో విధులకు హాజరు కావాల్సి వచ్చింది. తన బిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో.. ఆ పసికందును వెంట తెచ్చుకున్నారు. విసత్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ చెట్టుకు చీరను ఊయలగా చేసి, బిడ్డను బజ్జోపెట్టారు.

బిడ్డకు తల్లిగా.. బాధ్యత గల కానిస్టేబుల్‌గా..

కొద్దిరోజులుగా తన కుమారుడికి అనారోగ్యంగా ఉంటోందని, చనుబాలను ఇవ్వాల్సిన అవసరం ఉన్నందున వెంట తీసుకుని వచ్చానని సంగీత పర్మర్ వెల్లడించారు. ఓ బిడ్డకు తల్లిగా, బాధ్యత గల కానిస్టేబుల్‌గా విధులను నిర్వర్తించక తప్పట్లేదని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన అమెరికా అధ్యక్షుడికి భద్రతా కల్పించే విధులకు హాజరు కావడం తనకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు ఆమె. సంగీత పర్మర్ కర్తవ్య దీక్ష పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

English summary
Sangita Parmer, a police constable is performing her duties at Visat, Ahmadabad, with her one year old son. She says, "It is difficult but it is my responsibility to fulfill both duties of a mother and a constable. He is not well therefore, I have to bring and breastfeed him, Sangita Parmer added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X