వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమేథీ : సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలు పోటీకి సిద్దం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆమేథీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి సంజయ్ సింగ్ మొదటి , రెండవ భార్యలు పోటీకి సిద్దమయ్యారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ఆమేథీ ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమేథీ అసెంబ్లీ స్థానం నుండి సంజయ్ సింగ్ మొదటి భార్య, రెండో భార్యలు వేర్వేరు పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.సంజయ్ సింగ్ రెండో అమితా సింగ్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కోసం ప్రయత్నిస్తుండగా, ఆయన మొదటి భార్య గరిమాసింగ్ కు బిజెపి టిక్కెట్టును ఖరారు చేసింది. దీంతో ఈ స్థానంలో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.అయితే ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎంఏల్ఏ గాయత్రి ప్రజాపతికి సమాజ్ వాదీ టిక్కెట్టు కేటాయించింది.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీపార్టీలు ఎన్నికల పొత్తును కుదుర్చుకొన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీచేస్తుండగా, పమాజ్ వాదీ పార్టీ 298 స్థానాల్లో బరిలోకి దిగుతోంది.

కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఎన్నికల్లో పొత్తు ఏర్పాటు చేసుకొని పోటీచేస్తోన్నందున కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఈ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో సగం చొప్పున పోటీచేస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి ఆమేథీ స్థానం అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోట.అయితే సమాజ్ వాదీ పార్టీతో ఎన్నికల పొత్తు కుదుర్చుకొన్నందున ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అభ్యర్థుల ఎంపిక ఇబ్బందిగా మారింది.

ఆమేథీ నుండి ప్రజాపతి పోటీ

ఆమేథీ నుండి ప్రజాపతి పోటీ

ఆమేథీ అసెంబ్లీ స్థానం నుండి గాయత్రి ప్రజాపతి కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.గాయత్రి ప్రజా ప్రతి ఆమేథీ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె అఖిలేష్ మంత్రివర్గంలో మంత్రి కూడ.ఈ కూటమి తరపున ఇదే స్థానం నుండి ఆమెకు తిరిగి పోటీచేసే అవకాశం దక్కింది.

అమితాసింగ్ కు నిరాశేనా?

అమితాసింగ్ కు నిరాశేనా?

ఆమేథీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అమితాసింగ్ పోటీచేస్తారని భావించినప్పటికీ రాజకీయసమీకరణలతో ఆమేథీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి గాయత్రి ప్రజా పతికి పోటీచేసే అవకాశం దక్కింది. అమితాసింగ్ ఆమేథీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ కు రెండో భార్య.అయితే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఈ స్థానం నుండి పోటీచేసే అవకాశం దక్కలేదు.అయితే తానే ఈ స్థానం నుండిపోటీచేసేందుకుగాను అమితా సింగ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించే పనిలో ఉంది.

సంజయ్ సింగ్ మొదటి,రెండో భార్యల పోటీనా?

సంజయ్ సింగ్ మొదటి,రెండో భార్యల పోటీనా?

ఆమేథీ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు మాత్రం దక్కలేదు. అయితే ఈ టిక్కెట్టు కోసం ఆమె ప్రయత్నాలు ప్రారంభించింది.అయితే సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా గాయత్రి ప్రజాపతి రంగంలో నిలిచారు. ఆమేథీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ బరిలో నిలుస్తోందని భావించి సంజయ్ సింగ్ మొదటి భార్య గరీమా సింగ్ ను బిజెపి తన అభ్యర్థిగా ఎంపిక చేసింది. అమితా సింగ్ సంజయ్ సింగ్ కు రెండో భార్య.దీంతో ఈ స్థానం నుండి గాయత్రి ప్రజాపతి స్థానంలో తానే బరిలోకి దిగుతానని అమితాసింగ్ చెబుతున్నారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు.

 తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతా''

తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతా''

ఆమేథీ అసెంబ్లీ స్థానం నుంండి అమితా సింగ్ గతంలో ప్రాతినిథ్యం వహించారు. ఆమె కాంగ్రెస్ హయంలో మంత్రిగా కూడ పనిచేశారు. ఆమె భర్త సంజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అయితే ఈ స్థానం ఈ దఫా ఆమెకు దక్కేలా కన్పించడం లేదు.దీంతో ఆమె అధిష్టానాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒప్పుకోకపోతే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతానని అమితా సింగ్ ప్రకటించారు.మూడు దఫాలు ఈ స్థానం నుండి ఆమె ప్రాతినిథ్యం వహించారు.

English summary
sanjay singh first and second wives contest from amethi assembly segment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X