• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

whatsapp: మేడమ్ పోస్ట్ తో షాక్, నా పెళ్లికి అందరూ రండి, నటి, వెదవలను చేస్తున్నావా?

|

బెంగళూరు/ హైదరాబాద్: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చి మీడియాకు చిక్కకుండా మాయం అయిన స్యాండిల్ వుడ్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. నటి సంజనాను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, ఇది పక్కా లవ్ జీహాద్ ప్లాన్ అని ఆరోపణలు రావడంతో ఆమె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తన మీద వస్తున్న ఆరోపణలను లెక్కచెయ్యని సంజనా మేడమ్ తాను ఇస్లాం మతంలోకి మారానని పక్కా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు తాను ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటున్నానని, మీరు అందూరు రావాలని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఎవరిని వెదవలను చెయ్యాలనుకుంటున్నావ్ ? అంటూ హీరోయిన్ సంజనాకు పలువురు సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు.

Film Making: ఓటీటీ సిరీస్ చాన్స్ లు, మోడల్స్, ఆంటీలు టార్గెట్, లక్షల్లో సంపాధన, ఏం స్కెచ్!Film Making: ఓటీటీ సిరీస్ చాన్స్ లు, మోడల్స్, ఆంటీలు టార్గెట్, లక్షల్లో సంపాధన, ఏం స్కెచ్!

సెంట్రల్ జైల్లో మేడమ్

సెంట్రల్ జైల్లో మేడమ్

బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా గల్రానీని కొన్ని నెలల క్రితం అరెస్టు అయ్యి మూడు నెలలు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కాలం గడిపి బెయిల్ మీద బయటకు వచ్చింది. సంజనా వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చినా వాటిని లెక్కచెయ్యని మేడమ్ సైలెంట్ గా ఆమె పని ఆమె చేసుకుంటూ వెలుతోంది.

తెర మీదకు సంజనా లవ్ జీహాద్

తెర మీదకు సంజనా లవ్ జీహాద్

2018 అక్టోబర్ 9వ తేదీన హిందువు అయిన సంజనా గల్రానీకి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఆమె పేరును మహిరాగా మార్చారని, ఇస్లాం దర్మం ప్రకారం ఆమెకు మహిరా అని నామకరణం చేసి దృవీకరణ పత్రాం ఇచ్చారని, సంజనాకు ఇస్లాం మతం మార్చిన మౌల్వీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ప్రముఖ న్యాయవాది అమృతేష్ బెంగళూరులోని కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు పెట్టారు.

 నా ఇష్టప్రకారమే జరిగింది

నా ఇష్టప్రకారమే జరిగింది

బెయిల్ మీద బయటకు వచ్చిన నటి సంజనా గర్రానీ మొదటిసారి ఆమె మతం గురించి క్లారిటీ ఇచ్చింది. తాను ఇష్ట ప్రకారమే ఇస్లాం మతం స్వీకరించానని, మతం మారాలని తనను ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని నటి సంజనా వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా తాను ప్రేమించిన డాక్టర్ అజీజ్ తో తన నిశ్చితార్థం జరిగిందని, ఆ విషయం తన స్నేహితులకు తెలుసని సంజనా గల్రానీ వివరించారు.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్


స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా గల్రాని, ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ విషయం స్వయంగా సంజనా చెప్పింది. ఇస్లాం మతం ఆచారం ప్రకారం డాక్టర్ అజీజ్ తో నిశ్చితార్థం చేసుకున్నానని, త్వరలో తాను ఓ చారిటబుల్ సోసైటీలో సింపుల్ గా పెళ్లి చేసుకుంటానని, తన పెళ్లి సందర్బంగా పేదలకు సహాయం చేస్తానని, పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకోనని నటి సంజనా చెప్పింది. అయితే సంజనా ఆమె పెళ్లి డేట్ ను స్వయంగా వాట్సాప్ స్టేటస్ లో పోస్టు చెయ్యడంతో అది కాస్తా వైరల్ గా మారిపోయింది.

మేడమ్ పెళ్లి డేట్ ఏమిటో తెలుసా ?

మేడమ్ పెళ్లి డేట్ ఏమిటో తెలుసా ?

నటి సంజనా గల్రానీ తాను పెళ్లి చేసుకుంటున్నానని ఆమె వాట్సాప్ స్టేటస్ లో క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 30వ తేదీన నా పెళ్లి, మీరు అందరూ నా పెళ్లికి హాజరై ఆశీర్వదించాలని సంజనా పోస్టు చేసింది. ఫిబ్రవరి నెల 28 రోజులు మాత్రమే. సంజనా 30వ తేదీ ఎలా పెళ్లి చేసుకుంటుంది ? అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వేదాంతం మాట్లాడుతున్న సంజనా

వేదాంతం మాట్లాడుతున్న సంజనా

ఇస్లాం మతం, ధర్మం ప్రకారం ఖర్మ అనే పదం లేదని సంజనా వేదాంతం చెబుతోంది. నువ్వు సమాజానికి ఏమి ఇస్తున్నావు, నీకు సమాజాం ఏమి ఇవ్వాలి అని అందరూ ఆలోచించాలని, మనం సమాజానికి మంచి చెయ్యాలని, అప్పుడే దేవుడు మనకు మంచి చేస్తాడని, అంతవరకూ ఓపికగా అందరూ ఎదురు చూడాలని ఇస్లాం మతం చెబుతోందని సంజనా చెప్పింది. డ్రగ్స్ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తరువాత నటి సంజనా వేదాంతం మాట్లాడటంతో అందరూ షాక్ అవుతున్నారు.

ఎవరిని వెదవలను చేస్తున్నావ్ ?

ఎవరిని వెదవలను చేస్తున్నావ్ ?

ఫిబ్రవరి 30వ తేదీన నా పెళ్లి, మీరు అందరూ నా పెళ్లికి హాజరై ఆశీర్వదించాలని సంజనా పోస్టు చెయ్యడంతో సోషల్ మీడియాలో మేడమ్ కు కొందరు క్లాస్ పీకుతున్నారు. ఎవరిని వెదవలను చెయ్యాలని ఇలాంటి పోస్టులు చేస్తున్నావ్ ?, నువ్వు పెళ్లి చేసుకుంటే మాకేమి, చేసుకోకపోతే మాకేమి, ఈ ఏడాది ఫిబ్రవరి 30వ తేదీ వస్తుందా ? అని ప్రశ్నిస్తున్నారు. జైలుకు వెళ్లి వచ్చిన సంజనాకు ఏమైనా పిచ్చిపట్టిందా ? అంటూ కొందరు జోకులు వేస్తున్నారు. మొత్తం మీద నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని సోషల్ మీడియాలో పోస్టు చేసిన సంజనా ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

English summary
Sanjjanaa: Actress Sanjjanaa Galrani puts whatsapp status about her new marriage date Feb 30, that made everyone in shock.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X