• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Actress: మతం మార్చుకున్న ప్రభాస్ హీరోయిన్, నా ఇష్టం, లవ్ లో ఉన్నా, సినిమాలు, వెబ్ సిరీస్ !

|

బెంగళూరు/ చెన్నై/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయ్యి మూడు నెలల పాటు సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చి చాలా కాలంగా మీడియాతో పాటు ఎవ్వరికి చిక్కకుండా మాయం అయిన స్కాండిల్ వుడ్ బ్యూటీ, ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ ప్రత్యక్షం అయ్యింది. నటి సంజనాను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని, ఇది పక్కా లవ్ జీహాద్ ప్లాన్ అని ఆరోపణలు రావడంతో ఆమె ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తరువాత సంజనా మాత్రం ఎవ్వరికి చిక్కకుండా మాయం కావడంతో కథలు కథలుగా మాట్లాడుకున్నారు. ఇస్లాం మతంలోకి మారిన విషయంలో సంజనా ఓ మీడియాకు పక్కా క్లారిటీ ఇస్తూ ఇంటర్వూ ఇచ్చింది.

Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !Social Media: అమ్మాయిలు, ఆంటీలు టార్గెట్, సరదా, జల్సా కోసం ఏం చేశాడంటే, 50 మందితో !

ఈ కష్టాలు చాలు దేవుడా

ఈ కష్టాలు చాలు దేవుడా


బెంగళూరు డ్రగ్స్ మాఫియా కేసులో స్యాండిల్ వుడ్ బ్యూటీ, బహుబాష నటి సంజనా గల్రానీని కొన్ని నెలల క్రితం బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో కొన్ని నెలలు విచారణ ఖైదీగా ఉన్న సంజనా అనేక ప్రయత్నాలు చేసి చివరికి అనారోగ్యం కారణంతో కర్ణాటక హైకోర్టులో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చింది.

ముంబై ఫిల్మ్ సిటీలో రష్మిక మందన్న హల్‌చల్..

ఇస్లాం మతంలోకి సంజనా

ఇస్లాం మతంలోకి సంజనా

2018లో నటి సంజనా హిందూ మతం మారిపోయారని ఆర్ టీఐ కార్యకర్త, ప్రముఖ వ్యాపారి ప్రశాంత్ సంబర్గి పదేపదే ఆరోపించారు. 2018లోనే నటి సంజనా ఇస్లాం మతం స్వీకరించి ఆమె పేరును మహిరా గా మార్చుకున్నారని ఆమె అరెస్టు అయిన తరువాత ప్రశాంత్ సంబర్గి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ టీఐ కార్యకర్త ప్రశాంత్ సంబర్గి ఆరోపణలు చేసిన సమయంలో సంజనా ఏ మాత్రం నోరు విప్పలేదు.

 కేసులు... వివాదాలు

కేసులు... వివాదాలు

2018 అక్టోబర్ 9వ తేదీన హిందువు అయిన సంజనా గల్రానీకి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఆమె పేరును మహిరాగా మార్చారని, ఇస్లాం దర్మం ప్రకారం ఆమెకు మహిరా అని నామకరణం చేసి దృవీకరణ పత్రాం ఇచ్చారని, సంజనాకు ఇస్లాం మతం మార్చిన మౌల్వీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మనవి చేస్తూ ప్రముఖ న్యాయవాది అమృతేష్ బెంగళూరులోని కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే కేసు పెట్టారు. ఈ విషయంపై మౌల్వీ కూడా ఇప్పటికే వివరణ ఇచ్చారు.

అవును నిజమే... మతం మారాను

అవును నిజమే... మతం మారాను


బెయిల్ మీద బయటకు వచ్చిన నటి సంజనా గర్రానీ మొదటిసారి బెంగళూరు టైమ్స్ ఆంగ్ల పత్రికకు ఇంటర్వూ ఇచ్చారు. తాను ఇష్ట ప్రకారమే ఇస్లాం మతం స్వీకరించానని, మతం మారాలని తనను ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని నటి సంజనా వివరణ ఇచ్చారు. లాక్ డౌన్ సమయంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా తాను ప్రేమించిన డాక్టర్ అజీజ్ తో తన నిశ్చితార్థం జరిగిందని, ఆ విషయం తన స్నేహితులకు తెలుసని సంజనా వివరించారు.

 త్వరలో నా పెళ్లి

త్వరలో నా పెళ్లి

స్యాండిల్ వుడ్ బ్యూటీక్వీన్ సంజనా గల్రాని, ప్రముఖ వైద్యుడు అజీజ్ అనేక సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఈ విషయం స్వయంగా సంజనా చెప్పింది. ఇస్లాం మతం ఆచారం ప్రకారం డాక్టర్ అజీజ్ తో నిశ్చితార్థం చేసుకున్నానని, త్వరలో తాను ఓ చారిటబుల్ సోసైటీలో సింపుల్ గా పెళ్లి చేసుకుంటానని, తన పెళ్లి సందర్బంగా పేదలకు సహాయం చేస్తానని, పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేసుకోనని నటి సంజనా చెప్పింది.

నమాజ్ చేస్తున్నాను.. అది నా వ్యక్తిగతం

నమాజ్ చేస్తున్నాను.. అది నా వ్యక్తిగతం

తాను ఆధ్యాత్మికంగా దేవుడిని ప్రార్థిస్తున్నానని, నమాజ్ చదవడం నేర్చుకుంటున్నానని, తాను అన్ని మతాలను గౌరవిస్తానని, ఇస్లాం మతం మారడం తన వ్యక్తిగత వ్యవహారం అని, ఆ విషయం రాజకీయం, పబ్లిసిటీ చెయ్యడం తనకు ఇష్టం లేదని నటి సంజనా వివరించారు. తాను జైలుకు వెళ్లడం, కష్టాలను అనుభవించడం అన్నీ జరిగాయని, ప్రతి ఒక్క విషయం తాను నవ్వుతూనే ఆనందంగా ఎదుర్కొంటానని నటి సంజనా అన్నారు. న్యాయస్థానం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, నిర్దోషిగా బయట పడుతాననే నమ్మకం తనకు ఉందని బహుబాష నటి సంజనా గర్లానీ ధీమా వ్యక్తం చేశారు.

సినిమాలు... వెబ్ సిరీస్ చేస్తా

సినిమాలు... వెబ్ సిరీస్ చేస్తా

తన చేతిలో కొన్ని కన్నడ, తమిళ సినిమాల ఆఫర్లు ఉన్నాయని, ఆ సినిమాలు అన్నీ పూర్తి చేసిన తరువాత హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తానని, ఇప్పుడు మరో కొత్త సినిమా ఆఫర్ వచ్చిందని, దానికితోడు నిత్యం తాను సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లో ఉంటున్నానని నటి సంజనా అన్నారు. భవిష్యత్తు కార్యచరణ గురించి తాను ఆలోంచించి మంచి నిర్ణయం తీసుకుంటానని నటి సంజనా వివరించిందని బెంగళూరు టైమ్స్ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. మొత్తం మీద తన ఇష్ట ప్రకారమే ఇస్లాం మతం స్వీకరించానని నటి సంజనా గర్రాని క్లారిటీ ఇవ్వడంతో ఆ వివాదానికి తెరపడింది. 2008లో ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో సంజనా గర్రాని ఓ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

English summary
Sanjjanaa: Sandalwood Actress Sanjjanaa Galrani talks about her marriage and her decision to turning to Islam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X