• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ప్లాన్ చేసి ప్రాణం తీశాడా..? బ్లేడ్ ఎందుకు తెచ్చాడు.. మాదాపూర్ జంట కేసులో అన్నీ ట్వీస్టులే..?

|

మాదాపూర్‌‌లో గల హోటల్‌లో జంట మృతి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాములు, సంతోషి మృతికి సంబంధించి కచ్చితమైన ఆధారం ఏమీ దొరకలేదు. చెల్లి సంతోషికి ఇద్దరినైనా ఎదిరించే శక్తి ఉందని, పిరికిది కాదని సంతోషి అన్నయ్యలు అంటుండగా.. తన కుమారుడు ఆత్మహత్య చేసుకునే ధైర్యం చేయడని, గొంతుకోసుకొని ఉరేసుకునే అవకాశమే లేదని రాములు పేరంట్స్ అంటున్నారు.

స్వరపేటిక తెగే వరకు..?

స్వరపేటిక తెగే వరకు..?

బ్లేడ్‌తో గొంతుకోసుకున్న తర్వాత చున్నీతో రాములు ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అదీ నిజమని అనుకుంటే తనకు తానుగా బ్లేడ్‌తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి.. స్వరపేటిక తెగేంత లోతుగా కోసుకోగలడా...? ఒకవేళ కోసుకోగలిగితే ఆ తర్వాత కూడా చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకునేంత అవకాశం ఉంటుందా.. అనే అనుమానం కలుగుతుంది.

సంతోషిని బ్లేడ్‌తో గొంతుకోసి చంపేసిన రాములు.. ప్రియురాలి మృతదేహం రక్తపుమడుగులో పడి ఉండగా.. అదే బ్లేడ్‌తో అంత షాక్‌లో తాను గొంతును లోతుగా కోసుకోగలడా..? ఒక్క బ్లేడ్‌తో ఒకే వ్యక్తి రెండు గొంతుకలు కోయగలడా..? రెండు గొంతుకలు కోసినప్పటికీ బ్లేడ్‌ విరగకుండా, అంతే పదునుగా ఉంటుందా..? ఇది ప్రొఫెషనల్‌ కిల్లర్స్‌కైనా సాధ్యమవుతుందా..? ఇలా అనేక అనుమానాలు వస్తున్నాయి.

లోతుగా విచారణ..

లోతుగా విచారణ..

సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు రంగ ప్రవేశం చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందంతో కేసును లోతుగా విచారిస్తున్నారు. రాములు, సంతోషి బుధవారం మధ్యాహ్నం హోటల్లో దిగినప్పటి నుంచి మరుసటి రోజు చనిపోయేంత వరకు ఇద్దరూ ఎన్నిసార్లు బయటకు వచ్చారు.. ఏయే సమయంలో వచ్చారు.. బయట ఎక్కడెక్కడకి వెళ్లారు.. ఎం కొన్నారు.. ఎం తిన్నారు.. వీరు గదిలో ఉన్న సమయంలో హోటల్‌ సిబ్బంది ఎన్నిసార్లు వారిని కలిశారు.. దేనికోసం కలిశారు.. హోటల్‌ సిబ్బంది కాకుండా ఇంకా ఎవరైనా వారి గదికి వచ్చారా ఇలా అన్నికోణాల్లో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది.

హోటల్‌లోని సీసీటీవీల్లో రికార్డయి ఉన్న ఫుటేజీలను, సైబరాబాద్‌, హైదరాబాద్‌ కమిషనరేట్స్‌ పరిధిలో రెండు రోజులు వారు తిరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీలను విచారణ బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

ఫోరెన్సిక్ రిపోర్ట్..

ఫోరెన్సిక్ రిపోర్ట్..

ఈ కేసులో ఫోరెన్సిక్‌ రిపోర్టు కీలకంగా మారనున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు చేసిన పోస్టుమార్టం నివేదిక కూడా కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ఘటన జరిగిన హోటల్‌ గదిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మృతుల దుస్తులు, బ్యాగు, హత్యకు, ఆత్మహత్యకు ఉపయోగించిన బ్లేడ్‌, అక్కడ క్లూస్‌టీం సేకరించిన పలు ఆధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల కాల్‌డేటా కేసులో కీలకంగా మారనున్నట్లు పోలీసులు అంటున్నారు. హోటల్‌ గదిలో పోలీసులు మృతుల రెండు స్మార్ట్‌ఫోన్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఓపెన్ కానీ ఇద్దరీ ఫోన్లు

ఓపెన్ కానీ ఇద్దరీ ఫోన్లు

రాములు సెల్‌ఫోన్‌ కిందపడి డిస్‌ప్లే పగిలిపోయి ఉంది. సంతోషి ఫోన్‌ కూడా ఓపెన్‌ కావడంలేదు. రెండు ఫోన్‌లను పోలీసులు ఎఫ్‌ఎస్ఎల్‌కు పంపారు. వాటిని ఓపెన్‌ చేసిన తర్వాత.. మృతులు ఇద్దరూ రోజూ ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు..? ఇద్దరికి మధ్యలో ఎవరైనా కామన్‌ ఫ్రెండ్స్‌ ఉన్నారా..? ఇదంతా వారికి తెలిసి ఉంటుందా..? ఇలా అనేక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రాములు.. పథకం ప్రకారమే ప్రియురాలిని తీసుకొని హోటల్‌కు వచ్చాడని, వచ్చేటప్పుడే బ్లేడ్‌ వెంట తెచ్చుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉద్దేశం లేనివాడైతే కొత్త బ్లేడ్‌ కొనుక్కొని హోటల్‌కు రావాల్సిన అవసరం లేదనే వాదన వినిపిస్తోంది.

రోజుకు 3 వేలు చెల్లించి మరీ..

రోజుకు 3 వేలు చెల్లించి మరీ..

రోజుకు రూ. 3వేలు చెల్లించి హోటల్‌లో ఉండేంత అవసరం, స్తోమత గానీ వారికి లేవు. అలాంటి సమయంలో అంత పెద్ద హోటల్‌ను ఎందుకు ఎంచుకున్నాడు అని పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు.

ప్రస్తుతం సేకరించిన ఆధారాలను బట్టి మృతుడు రాములు కావాలనే ముందస్తు పథకం ప్రకారమే హోటల్‌ను ఎంపిక చేసుకున్నట్లు, పెళ్లి సమస్య పరిష్కారం కాకపోతే ప్రియురాలిని చంపి, తాను ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరోన్సిక్‌, పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు వెర్షన్. అప్పటివరకు ఇద్దరి మృతికి సంబంధించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.

English summary
santoshi-ramulu murder case investigation going on. santoshi murder is pre-planned police officials suspects.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X