చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప‌ర‌స్త్రీ వ్యామోహం.. హ‌త్య‌.. యావ‌జ్జీవం: శ‌ర‌వ‌ణ భ‌వన్ రాజ‌గోపాల్ మృతి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: దేశ‌, విదేశాలకు విస్త‌రించిన శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ గ్రూప్ హోట‌ళ్ల వ్య‌వ‌స్థాప‌క‌క అధినేత‌, దోసె కింగ్‌గా పేరుపొందిన పీ రాజగోపాల్ క‌థ విషాదంత‌మైంది. యావ‌జ్జీక కారాగార శిక్ష‌ను అనుభ‌విస్తున్న ఆయ‌న గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌స్సు 72 సంవ‌త్స‌రాలు. చెన్నైలోని స్టాన్లీ వైద్య‌క‌ళాశాల‌ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉద‌యం మృతిచెందారు. ఆ స‌మ‌యంలో ఆయన కుమారుడు శ‌ర‌వ‌ణ‌న్ అక్క‌డే ఉన్నారు. రాజ‌గోపాల్ మ‌ర‌ణించిన విష‌యాన్ని ఆయ‌న ధృవీక‌రించారు. ఓ హ‌త్య కేసులో ఆయ‌న యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. కారాగారంలో ఉండ‌గా ఈ నెల 15వ తేదీన గుండెపోటుకు గుర‌య్యారు. వెంట‌నే ఆయ‌న‌ను స్టాన్లీ ఆసుప‌త్రి ప్రిస‌న్ వార్డుకు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఈ ఉద‌యం 10:30 గంట‌ల స‌మ‌యంలో మ‌ర‌ణించారు.

రాజ‌గోపాల్‌ను వెంటాడిన 2001 నాటి హ‌త్య‌కేసు..

రాజ‌గోపాల్‌ను వెంటాడిన 2001 నాటి హ‌త్య‌కేసు..

2001లో చోటు చేసుకున్న ఓ హ‌త్యోదంతంలో రాజ‌గోపాల్ ప్ర‌ధాన నిందితుడు. ఆయ‌నను దోషిగా గుర్తించింది మ‌ద్రాసు హైకోర్టు. యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను విధించింది. ఈ తీర్పుపై ఆయ‌న సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. త‌న వ‌య‌స్సు, అనారోగ్య కార‌ణాల‌ను చూపిస్తూ, యావ‌జ్జీవ కారాగార శిక్షను త‌గ్గించాల‌ని ఆయ‌న దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను విచార‌ణకు స్వీక‌రించింది సుప్రీంకోర్టు. కేసు పూర్వాప‌రాల‌ను ప‌రిశీలించిన త‌రువాత‌-మ‌ద్రాసు హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించింది. వెంట‌నే- లొంగిపోవాల‌ని కూడా ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు ఆదివారం ఆయ‌న పోలీసుల‌కు లొంగిపోయారు. కారాగార శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. 15వ తేదీన గుండెపోటుకు గుర‌య్యారు.

బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు హైడ్రామా: జారుకుంటున్న ఎమ్మెల్యేలు బ‌ల‌ప‌రీక్ష‌కు ముందు హైడ్రామా: జారుకుంటున్న ఎమ్మెల్యేలు

జ్యోతిష్యుడి మాట విని..

జ్యోతిష్యుడి మాట విని..

శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ గ్రూప్ హోట‌ళ్ల అధినేత‌గా ప్ర‌ఖ్యాతి చెందిన రాజ‌గోపాల్ ప‌త‌నానికి కార‌ణం ఓ జ్యోతిష్యుడంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు. మూడో వివాహం చేసుకోవ‌డం వ‌ల్ల జాత‌కంలో ఉన్న దుష్ట‌గ్ర‌హాల ప్ర‌భావం త‌గ్గిపోతుంద‌ని, వ్యాపారం మ‌రింత విస్త‌రిస్తుందంటూ 2000లో ఓ జ్యోతిష్యుడు ఆయ‌న‌కు సూచించారు. అప్ప‌టికే ఆయ‌న‌కు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తన హోట‌ల్‌లో ప‌నిచేస్తోన్న ఓ ఉద్యోగి కుమార్తెను మూడో భార్య‌గా చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. ఆమెకు త‌న హోట‌ల్‌లో బ్రాంచ్ మేనేజ‌ర్‌గా ఉద్యోగాన్ని క‌ల్పించారు. క్ర‌మంగా ఆమెకు ద‌గ్గ‌ర కావ‌డానికి ప్ర‌య‌త్నించారు. అదే హోట‌ల్‌లో ప‌నిచేస్తోన్న శాంతాకుమార్ అనే యువ‌కుడిని ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకుంది. తాను ఇష్ట‌ప‌డిన అమ్మాయి శాంతాకుమార్‌ను పెళ్లి చేసుకుంటోంద‌న్న విష‌యం తెలుసుకున్న త‌రువాత‌- వారిద్ద‌రి పెద్ద ఎత్తున గొడ‌వ‌లు చెలరేగాయి. అయిన‌ప్ప‌టికీ- ఆమె త‌న మ‌న‌సు మార్చుకోలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసింది. శాంతాకుమార్‌ను పెళ్లాడింది.

శాంతాకుమార్‌ హ‌త్య‌కు కుట్ర‌

శాంతాకుమార్‌ హ‌త్య‌కు కుట్ర‌


త‌న‌ను కాద‌ని, ఓ మామూలు ఉద్యోగిని పెళ్లాడింద‌నే కోపంతో ర‌గిలిపోయారు రాజ‌గోపాల్‌. శాంతాకుమార్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నాడు. 2001లో అత‌ణ్ని హ‌త్య చేయించాడు. కొన్ని మ‌లుపులు తిరిగిన త‌రువాత ఈ కేసు రాజ‌గోపాల్ వ‌ద్ద ఆగిపోయింది. చివ‌రికి ఆయ‌నే ప్ర‌ధాన నిందితుడిగా తేలింది. ఆయ‌న పాటు శాంతాకుమార్ హ‌త్య‌కేసులో మ‌రో 11మందిని దోషులుగా గుర్తించింది. దీనితో 2004లో మ‌ద్రాసు హైకోర్టు ఆయనను దోషిగా నిర్ధారించింది. యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను విధించింది. అప్ప‌టి నుంచి బెయిల్‌పై బ‌య‌టే ఉంటూ వ‌చ్చారు రాజ‌గోపాల్‌. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు సైతం మ‌ద్రాసు హైకోర్టు తీర్పును స‌మ‌ర్థించింది.

సుప్రీంకోర్టులో చుక్కెదురు..

సుప్రీంకోర్టులో చుక్కెదురు..

త‌న తండ్రి వృద్ధాప్యాన్ని, అనారోగ్య కార‌ణాల‌ను దృష్టిలో ఉంచుకుని న్యాయ‌స్థానం ముందు లొంగిపోవ‌డానికి మ‌రికొంత గ‌డువు ఇవ్వాల‌ని, యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ను త‌గ్గించాల‌ని కోరుతూ ఆయ‌న కుమారుడు శ‌ర‌వ‌ణ‌న్ ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేశారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, జ‌స్టిస్ మోహ‌న్ ఎం శంత‌న గౌడ‌ర్‌, జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగీల‌తో కూడిన ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం ఈ కేసును విచార‌ణకు స్వీకరించింది. అన్ని అంశాల‌ను ప‌రిశీలించిన త‌రువాత‌- జులై 7వ తేదీ నాటికి లొంగిపోవాల‌ని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ‌గోపాల్ ఈ నెల 7వ తేదీన పోలీసుల స‌మ‌క్షంలో లొంగిపోయారు. కారాగార శిక్ష‌ను అనుభ‌విస్తూ ఈ నెల 15వ తేదీన గుండెపోటుకు గుర‌య్యారు. స్టాన్లీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ఈ ఉద‌యం మ‌ర‌ణించారు.

English summary
Two days after the Madras High Court permitted the founder of South-Indian food chain Saravana Bhavan to be moved to a private hospital in the state capital of Tamil Nadu, P Rajagopal passed away at the medical facility on Thursday morning. Sentenced to life imprisonment for the murder of one of his employees, Rajagopal surrendered in the previous week after the Supreme Court of India rejected his plea seeking more time to furnish a defense.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X