చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగి హత్య కేసులో శరవణ భవన్ యజమానికి షాక్: వెంటనే లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

ప్రముఖ హోటల్ శరవణన్ భవన్ యజమాని రాజగోపాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 18 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో శరవణన్‌కు జీవితకాల శిక్ష కోర్టు విధించింది. అయితే జూలై 7నాటికల్లా సరెండర్ కావాల్సి ఉండగా తన అనారోగ్యంను కారణంగా చూపుతూ సరెండర్ కాలేదు. ఇదే విషయాన్ని తెలుపుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే సుప్రీం కోర్టు శరవణన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

శరవణన్ భవన్‌‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని యజమాని రాజగోపాల్‌‌తో పాటు మరో ఎనిమిది మంది హత్య చేశారని అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. తన హోటల్‌లో పనిచేసే శాంతకుమార్ భార్యను రాజగోపాల్ వివాహం చేసుకోవాలని భావించారు. దీంతో శాంతకుమార్‌ను అడ్డుతొలగించుకోవాలని భావించి డేనియేల్, కర్మేగమ్, జాకీర్ హుస్సేన్, కాశీ విశ్వనాథన్, ముట్టురాజన్ అనేవారితో కలిసి శాంతకుమార్‌ను హత్యచేయించాడు. 2001లో ఈ ఘటన జరిగింది. జ్యోతిష్యులను బాగా నమ్మే రాజగోపాల్... శాంతకుమార్ భార్య జీవజ్యోతిని వివాహం చేసుకుంటే మరింత ఆస్తులు పెరుగుతాయని చెప్పారట. అప్పటికే రాజగోపాల్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్యగా వచ్చిన మహిళ శరవణన్ హోటల్‌లో పనిచేసే ఉద్యోగి భార్యే కావడం విశేషం.

Saravana Bhavan owner Rajagopal gets shock in SC, asks to surrender

2001 అక్టోబర్ 26న శాంతకుమార్‌ను రాజగోపాల్ మనుషులు చెన్నై నుంచి కిడ్నాప్ చేసి కొడైకెనాల్‌లో హత్య చేశారు. శాంతకుమార్ మృతదేహాన్ని అటవీశాఖ పోలీసులు టైగర్ చోలా ఫారెస్టులో కనుగొన్నారు. 2004లో ప్రత్యేక కోర్టు రాజగోపాల్‌ను దోషిగా తేలుస్తూ తీర్పు ఇచ్చింది. అంతేకాదు 10ఏళ్లు కఠినకారాగార శిక్ష విధించింది.ఇక ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాజగోపాల్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. హైకోర్టు ఆయనకు జీవితకాల శిక్షను విధిస్తూ రూ. 55 లక్షలు జరిమానా విధించింది. అందులో రూ. 50 లక్షలు శాంతకుమార్ భార్య జీవనజ్యోతికి చెల్లించాలంటూ తీర్పు ఇచ్చింది. ఇక దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా రాజగోపాల్‌కు నిరాశే ఎదురైంది.

English summary
The Supreme Court Tuesday refused to grant relief to Saravana Bhavan owner P Rajagopal after he failed to surrender in an 18-year-old murder case in which he has been awarded life sentence. Rajagopal, who was to surrender by July 7, had sought more time citing health complications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X