వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెలికాప్టర్‌లో రాక.. సర్పంచ్‌గా గెలిచి, ఎక్కడ, ఎవరు అంటే..

|
Google Oneindia TeluguNews

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రముఖులు/ పారిశ్రామిక వేత్తలు ఇందుకు మినహాయింపేం కాదు. అలా మహారాష్ట్రలో కూడా ఓ పారిశ్రామిక వేత్త పోటీ చేసి గెలుపొందారు. ఇక ప్రమాణ స్వీకారం చేయాల్సిన సమయం వచ్చింది. ఇంకేముంది అసలే బిజినెస్ మెన్ కావడంతో.. మామూలుగా రావాలని అనుకోలేదు. అందుకోసం కొత్తరకంగా ఆలోచించాడు.

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మందీమార్బలంతో, డప్పు చప్పుళ్లతో, బాణసంచా కాలుస్తూ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. కానీ మహారాష్ట్రలో పారిశ్రామిక వేత్త జలింగర్ గగరె మాత్రం ఏకంగా హెలికాప్టర్ లో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. జలిందర్ గగరె పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. అహ్మద్ నగర్ తాలూకాలో గల అంబీ దుమాలాలో సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందారు. పారిశ్రామికవేత్త కావడంతో పుణెలో ఉంటారు. గెలుపొందిన తర్వాత ప్రమాణస్వీకారం చేసే రోజు రానే వచ్చింది.

sarpanch winner came in helicopter for oath taking

పుణె నుంచి వచ్చేందుకు కొత్తగా ఆలోచించాడు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు గ్రామంలో గల ఆలయాలపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించారు. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. బాణసంచా కాలుస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు. గ్రామ అభివృద్ధి కోసమే తాను సర్పంచ్‌గా పోటీ చేశానని జలిందర్ చెప్పారు.

English summary
sarpanch winner came in helicopter for oath taking at maharashtra ambi village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X