వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పళనిసామి, పన్నీర్ కు చెక్ పెట్టాలని జైల్లో సంతకం చేసిన శశికళ, ట్రెజరర్ పదవిలో రెబల్ !

అన్నాడీఎంకే పార్టీ వర్గ రాజకీయాలు, కీలక పదవులలో నాయకులుశశికళ వర్గం అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ట్రెజరర్ గా రెబల్ ఎమ్మెల్యే రింగసామిబెంగళూరు సెంట్రల్ జైల్లో కీలక పత్రాలపై సంతకాలు చేసిన చిన్నమ్మ శశికళ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాల్లో పదవుల కోసం చాల మంది నాయకులు పోటీ పడుతున్నారు. అన్నాడీఎంకే (అమ్మ) శశికళ వర్గంలోని నాయకులకు ఆ పార్టీ కీలక పదవులు కట్టబెడుతున్నారు. ఎన్నికల కమిషన్ రెండాకుల చిహ్నం ఎవ్వరికి కేటాయిస్తోందో అనే విషయం అక్టోబర్ 5వ తేదీ తేలిపోతుంది.

జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది: వివరణ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు!జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది: వివరణ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు!

ఈ సందర్బంలో పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి తరువాత కీలక పదవి అయిన ట్రెజరర్ పదవిని శశికళ తన వర్గంలోని ఎమ్మెల్యే రింగసామికి కట్టబెట్టారు. రెండు రోజుల క్రితం అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యే రింగసామి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు చేరుకుని ములాఖత్ లో శశికళతో భేటీ అయ్యారు.

Sasikala approved MLA Rengasami as AIADMK Amma team treasurer

ఆ సమయంలో అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ట్రెజరర్ గా ఎమ్మెల్యే రింగసామిని నియమిస్తూ శశికళ కీలక పత్రాలపై సంతకాలు చేశారని బుధవారం వెలుగు చూసింది. అన్నాడీఎంకే పార్టీ ట్రెజరర్ గా తనను నియమించారని ఎమ్మెల్యే రింగసామి శశికళ సంతకాలు చేసిన పత్రాలను భారత ఎన్నికల కమిషన్ కు అందించడానికి సిద్దం అయ్యారు.

అపోలో ఆసుపత్రిలో జయలలితను మంత్రులు అందరూ చూశారు: బాంబు పేల్చిన మంత్రి !అపోలో ఆసుపత్రిలో జయలలితను మంత్రులు అందరూ చూశారు: బాంబు పేల్చిన మంత్రి !

బుధవారం ఎమ్మెల్యే రింగసామి శశికళతో భేటీ అయిన విషయం, ట్రెజరర్ పదవిలో తనను నియమించిన విషయం మీడియాకు చెప్పారు. శశికళ వర్గంలోని అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ట్రెజరర్ పదవిలో ఇంత వరకూ ఎవ్వరినీ నియమించకపోవడంతో ఎన్నికల కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉండటంతో జైల్లోనే శశికళ ఆ పదవిలో ఎమ్మెల్యే రింగసామిని నియమిస్తూ సంతకాలు చేశారని వెలుగు చూసింది.

English summary
Sasikala approved MLA rengasami as ADMK amma team treasurer. In that decree her sign is there is seems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X