• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శశికళ ఫ్యామిలీ ఫైట్: దివాకరన్, టీటీవీ దినకరన్ తమ్ముడు వేరు కుంపటి, ఏం చేస్తారు!

|

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన శశికళ కుటుంబ సభ్యుల్లో మళ్లి రచ్చ మొదలై ఫ్యామిలీ ఫైట్ కు దారితీసింది. శశికళ సొంత సోదరుడు దివాకరన్, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సొంత తమ్ముడు భాస్కరన్ వేరు కుంపటి పెట్టి దినకరన్ పెత్తనం చేస్తున్నాడని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారంతో శశికళ ఏం చెయ్యాలో తెలీక బెంగళూరు సెంట్రల్ జైల్లో సతమతం అవుతున్నారని తెలిసింది.

ఆర్ కే నగర్ దెబ్బ!

ఆర్ కే నగర్ దెబ్బ!

ఆర్ కే నగర్ లో టీటీవీ దినకరన్ పోటీ చెయ్యకూడదని మొదటి నుంచి శశికళ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎవ్వరినీ లెక్కచెయ్యకుండా టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ నుంచి పోటీ చేసి సొంత కుటుంబ సభ్యులను ఎదిరించారు.

  Jayalalithaa 'Eternal General Secretary',Sasikala Removed ఆ పదవి ఎప్పటికీ జయలలితదే | Oneindia Telugu
  శశికళ మాత్రమే!

  శశికళ మాత్రమే!

  ఆర్ కే నగర్ లో టీటీవీ దినకరన్ పోటీ చెయ్యడానికి శశికళ మాత్రమే అంగీకరించారని, ఆమె కుటుంబ సభ్యులు అందరూ వ్యతిరేకించారనే విషయం తెలిసిందే. ఆర్ కే నగర్ లో విజయం సాధించిన టీటీవీ దినకరన్ ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర పర్యటనలో నానా హంగామా చేస్తున్నారు.

  సొంత సోదరుడు

  సొంత సోదరుడు

  టీటీవీ దినకరన్ టీటీవీ భాస్కరన్ తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానని, తమిళనాడులోని 234 నియోజక వర్గాల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ఇటీవల ప్రకటించారు. ఎంజీఆర్ విగ్రహాలకు అభిషేకాలు చేసిన భాస్కరన్ ఆయన అనుచరులతో కలిసి ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఫెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.

  శశికళ సోదరుడి పోరు

  శశికళ సోదరుడి పోరు

  శశికళ నటరాజన్ సొంత సోదరుడు, వ్యాపారవేత్త దివాకరన్ మొదటి నుంచి దినకరన్ ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దివాకరన్ కుమారుడు జై ఆనంద్ అయితే ఏకంగా టీటీవీ దినకరన్ ను లక్షంగా చేసుకుని సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తూనే ఉన్నాడు.

   శశికళ వార్నింగ్!

  శశికళ వార్నింగ్!

  నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, మీ కారణంగా ఆదాయపన్ను శాఖ దాడులు జరిగాయని, జయలలిత చికిత్స వీడియో ఎందుకు విడుదల చేశారని, ఇలాగే ఉంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని శశికళ ఇటీవల హెచ్చరించినా ఆమె కుటుంబ సభ్యుల తీరులో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

  మూడు వర్గాలు

  మూడు వర్గాలు

  శశికళ ఫ్యామిలీలో ఇప్పుడు మూడు వర్గాలు తయారైనాయి. టీటీవీ దినకరన్, దివాకరన్, టీటీవీ భాస్కరన్ ఎవరికి వారే అనట్లు ప్రవర్థిస్తున్నారు. ఇక శశికళ వదిన ఇళవరసి కుమార్తె క్రిష్ణప్రియ, ఆమె సోదరుడు, జయా టీవీ ఎండీ వివేక్ మాత్రం మౌనంగా అన్నీ గమనిస్తున్నారు.

  మన్నార్ గుడి మాఫియా

  మన్నార్ గుడి మాఫియా

  మొదటి నుంచి శశికళ ఇళవరసి కుమార్తె క్రిష్ణప్రియ, వివేక్ కు అనుకూలంగా ఉన్నారు. ఇక శశికళ భర్త నటరాజన్ మాత్రం అనారోగ్యం కారణంగా రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి చూపించడం లేదు. మొత్తం మీద మన్నార్ గుడి మాఫియాలో వర్గ పోరు ఎక్కడికి వెలుతుందో, ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియడంలేదు అని శశికళ వర్గీయులు అంటున్నారు.

  English summary
  TTV Dinakaran face to family politics.Sasikala brother Divakaran and Baskaran against TTV Dinakaran.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X