వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి పదవి వద్దన్న శశికళ, ప్రధాన కార్యదర్శిగా, చక్రం తిప్పేది ఆమెనే

జయలలిత మృతి నేపథ్యంలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు మరికొందరు పేర్లు సీఎం రేసులో వినిపించాయి.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మృతి నేపథ్యంలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంతో పాటు మరికొందరు పేర్లు సీఎం రేసులో వినిపించాయి. చివరకు మాత్రం పన్నీరు సీఎం అయ్యారు. ఆయనను సీఎం చేయడం వెనుక శశికళ పాత్ర ఉందని చెబుతున్నారు.

జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?జయ మృతి: పన్నీరు సెల్వం వెనుక శశికళ, అప్పుడే పట్టు కోసం పావులు?

మరో ఆసక్తికర విషయం ఏమంటే జయలలిత సన్నిహితురాలు అయిన శశికళ పేరును కూడా సీఎం పదవికి పార్టీలో కొంతమంది తెర పైకి తెచ్చారని, కానీ ఆమె అంగీకరించలేదని వార్తలు వస్తున్నాయి. దుఖంలో ఉన్నప్పుడు పార్టీకి ఇలాంటివి మంచిది కాదని తిరస్కరించారని తెలుస్తోంది.

sasikala

దాంతో పాటు మరిన్ని కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఆస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఒక తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసు తేలకుండా ఇలా సీఎం పదవి చేపట్టడం తొందరపాటు అవుతుందని ఆమె భావించారని తెలుస్తోంది.

జయ మరణించిన ఈ దుఃఖ సమయంలో సీఎం పదవి చేపడితే పార్టీ శ్రేణులకు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయం కూడా వచ్చినట్లవుతుందని భావించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వాసపాత్రుడు, వివాదరహితుడు పన్నీర్ సెల్వంకే ఆ పగ్గాలు కట్టబెట్టాలని ఆమె నిర్ణయించారని అంటున్నారు. పోయెస్‌గార్డెన్‌ నుంచే చక్రం తిప్పనున్నారు.

శశికళతో పాటు మాజీ ఐఏఎస్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్‌ పేరు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ కూడా అత్యంత సన్నిహితురాలు. వీరితో పాటు లోకసభ ఉపసభాపతి తంబిదురై కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నట్లు తొలుత ప్రచారం జరిగింది.

జయలలిత ఆసుపత్రిలో చేరింది మొదలు సపర్యలు చేస్తూ ఉన్నది శశికళ, ఆమె సోదరుడి భార్య ఇళవరసి, పన్నీర్ సెల్వం, తంబిదురై, పళణిస్వామిలు మాత్రమే. ముఖ్యమంత్రి పదవికి మంత్రి పళణిస్వామి కూడా పోటీ పడ్డారు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా పన్నీర్ సెల్వం వైపు మొగ్గు చూపారు.

మోడీ రాగానే ముఖ్యమంత్రి, శశికళ కన్నీరుమున్నీరు, భుజం తట్టిన ప్రధానిమోడీ రాగానే ముఖ్యమంత్రి, శశికళ కన్నీరుమున్నీరు, భుజం తట్టిన ప్రధాని

అంతా తానై..

జయలలిత మృతి నేపథ్యంలో ఆమె సన్నిహితురాలు శశికళ అన్నీ తానై నడిపించారు. అంతిమ సంస్కారాలను శశికళనే నిర్వహించారు. కొత్త సీఎం పన్నీరు సెల్వం ఎంపిక వెనుక కూడా ఆమె పాత్ర ఉందని అంటున్నారు.

దటీజ్ జయలలిత! ఎన్నైనా..: జగన్, 'అమ్మ' వారిని నమ్మేవారు కాదా?దటీజ్ జయలలిత! ఎన్నైనా..: జగన్, 'అమ్మ' వారిని నమ్మేవారు కాదా?

రెండు టన్నుల పూలు

రెండు టన్నులకు పైగా పూలు, 40 మంది కార్మికులు10 గంటలకు పైగా శ్రమించి.. జయలలిత అంతిమ యాత్ర కోసం వాటిని సిద్ధం చేశారు. బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఈ పూలను తెప్పించారు. జయ మరణ వార్త తెలియగానే 40 మంది కార్మికులు మంగళవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి వివిధ రకాలైన 2 వేల కిలోల పూలతో అలంకరణలు, దండలు అల్లడం లాంటి పనులు చేపట్టారు.

అంతిమయాత్రకు ఉపయోగించిన ఆర్మీ ట్రక్కును, అంత్యక్రియలు నిర్వహించే మెరీనా బీచ్‌ ప్రాంతాన్ని పూలతో అందంగా తీర్చిదిద్దారు. అంతిమయాత్రకు తగినట్లు పూలను ఎంచుకుని పనులు వేగంగా పూర్తి చేశారు.

English summary
Sasikala and family mark their clout around Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X