చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళ స్కెచ్: ఒక్కటౌతున్న మన్నార్ గుడి మాఫియా, పళనిసామికి చెక్, పార్టీ, ప్రభుత్వం ?

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎడప్పాడి పళనిసామిని సీఎం పదవి నుంచి తప్పించడానికి స్కెచ్ వేస్తున్నారని వెలుగు చూసింది.

చిన్నమ్మ శశికళ నటరాజన్ వదిన మృతి, పెరోల్ ఇవ్వాలని సుప్రీం కోర్టులో అర్జీ!చిన్నమ్మ శశికళ నటరాజన్ వదిన మృతి, పెరోల్ ఇవ్వాలని సుప్రీం కోర్టులో అర్జీ!

తాను జైలుకు వెళ్లి ఐదు నెలలు అవుతున్నా ఒక్క సారి కూడా చూడటానికి ఎడప్పాడి పళనిసామి రాలేదని శశికళ అగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎడప్పాడి పళనిసామిని ఎంతగానో నమ్మి ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు తనను, తన కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదని శశికళ మండిపడ్డారని తెలిసింది.

Sasikala family openly joins hand against Edappadi Palanisamy

సొంత సోదరుడు సుందరవదనం సతీమణి సంతానలక్ష్మి మరణించినా కనీసం అధికారంలో ఉన్న ఒక్క నాయకుడు కూడా అంత్యక్రియలకు హాజరుకాలేదని, ఇలాగే ఉంటే మా కుటుంబ సభ్యులు (మన్నార్ గుడి మాఫియా) అందర్నీ కచ్చితంగా తొక్కేస్తారని శశికళ ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

శశికళ ఎఫెక్ట్: మరో లేఖతో కలకలం, జైల్లో చాల మంది వీవీఐపీలు, ఖరీదైన దంపతులు!శశికళ ఎఫెక్ట్: మరో లేఖతో కలకలం, జైల్లో చాల మంది వీవీఐపీలు, ఖరీదైన దంపతులు!

ఈ సమయంలో శశికళ భర్త నటరాజన్, టీటీవీ దినకరన్, దివాకరన్ అభిప్రాయ విభేదాలు పక్కన పెట్టి ఒక్కటి కావడానికి పక్కా ప్లాన్ వేశారని వెలుగు చూసింది. అందరూ ఒక్కటై ప్రభుత్వాన్ని, అన్నాడీఎంకే పార్టీని తమ చేతుల్లోకి తీసుకుని ఎడప్పాడి పళనిసామికి చుక్కలు చూపించాలని మంతనాలు జరుపుతున్నారని వెలుగు చూసింది.

English summary
Sasikala Family members Dinakaran, Divakaran now join hands with against Edappadi Palanisamy who control the AIADMK party and Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X