వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత వారసుడు ఇతడే ? అంత్యక్రియలు చేశాడు

జయలలిత అంత్యక్రియల సమయంలో శశికళ పక్కనే నిలబడి అంత్యసంస్కారాలు చేసిన దీపక్ పేరు ఇప్పుడు తెరమీదకు వచ్చింది. జయ సోదరుడు జయకుమార్ కుమారుడే దీపక్.

|
Google Oneindia TeluguNews

చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియల్లో పాల్గొన్న దీపక్ అనే వ్యక్తి పేరు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో చర్చకు తెరలేపింది. జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చెలి శశికళ పక్కనే నిలబడి జయలలితకు అంత్యక్రియలు చేసిన దీపక్ ఎవరు అనే విషయం ప్రపంచానికి తెలిసింది.

జయలలిత సోదరుడు జయకుమార్ కుమారుడే ఈ దీపక్. సోమవారం కన్ను మూసిన జయలలిత అంత్యక్రియలు మంగళవారం మేరినా బీచ్ లోని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ స్మారక మందిరం సమీపంలో జరిగాయి.

ఆ సమయంలో శశికళ పక్కనే నిలబడిన దీపక్ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జయలలిత అంత్యక్రియలు నిర్వహించారు. దీపక్ చెన్నైలోని త్యాగరాజ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. జయలలిత సోదరుడు జయకుమార్ 1995లో మరణించిన సమయంలో జయలలిత వారి ఇంటికి వెళ్లారు.

Sasikala had contacted Deepak to avoid any legal challenges ?

ఆ సమయంలో సోదరుడు జయకుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జయలలిత తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంత కాలానికి జయకుమార్ భార్య విజయలక్ష్మి మరణించారు. అయితే వదిన విజయలక్ష్మి చనిపోయిన సమయంలో జయలలిత వారి ఇంటి వైపు కన్నెత్తికూడా చూడలేదు.

జయకుమార్ కుమార్తె దీప మాధవన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ పెళ్లికి జయలలిత హాజరుకాలేదు. తరువాత దీప, మాధవన్ దపంతులు పోయెస్ గార్డెన్ వెళ్లి జయ ఆశీర్వాధం తీసుకున్నారు. ప్రస్తుతం దీప భర్తకు దూరంగా ఉంటుందని సమాచారం.

త్యాగరాజనగర్ లో నివాసం ఉంటున్న దీపక్ మొదట స్టీల్ వ్యాపారం చేసేవాడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దీపక్ అంటే జయలలితకు ఇష్టం అని సమాచారం. దీపక్ అప్పుడప్పుడు అత్త ఇంటికి వెళ్లి వచ్చేవాడని తెలిసింది.

Sasikala had contacted Deepak to avoid any legal challenges ?

జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరిన తరువాత రెండు మూడు సార్లు అక్కడికి వెళ్లి మా అత్తను చూపించండి అంటూ హంగామా చేసిన దీపను శశికళ అండ్ టీం దూరం పెట్టారు. ఇప్పుడు జయలలిత అంత్యక్రియలకు దీప సోదరుడు దీపక్ ను తీసుకురావడంతో అన్నాడీఎంకేలో చర్చ మొదలైయ్యింది.

అన్నాడీఎంకే పార్టీలో దీపక్ ఇక ముందు క్రియాశీలకంగా పనిచేస్తారా ? లేదా జయ ఆస్తుల జోలికి అతను రాకుండా బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారా ? చట్టపరంగా ఆస్తుల విషయంలో కోర్టుకు వెళ్లకుండా దీపక్ ను అడ్డుకుంటున్నారా ? కేవలం అంత్యక్రియల సమయంలో దీపక్ ను పావుగా వాడుకున్నారా ? అంటూ జయలలిత అభిమానులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

English summary
The family of Jayalalithaa’s aide Sasikala had contacted Deepak to avoid any legal challenges in the post death affairs of the Tamil Nadu Chief minister,sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X