బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత మృతి: ఎదరు ప్రశ్నించిన చిన్నమ్మ శశికళ, అప్పుడే సమాధానం, ఎవరు?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ కు తన మీద మీకు ఎవరు ఫిర్యాదు చేశారో చెప్పాలని, అప్పుడే సమాధానం చెబుతానని చిన్నమ్మ శశికళ సమాచారం ఇచ్చారు.

 అమ్మకు జీవితాంతం సేవ

అమ్మకు జీవితాంతం సేవ

జయలలితకు తాను జీవితాంతం సేవ చేశానని, తన మీద మీకు ఎలా అనుమానాం వచ్చిందని, మీకు తన మీద ఎవరు ఫిర్యాదు చేశారో చెబితే అప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ శుక్రవారం చెప్పారు.

 చిన్నమ్మకు సమన్లు

చిన్నమ్మకు సమన్లు

జయలలిత మృతిపై విచారణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు సమన్లు జారీ చేసింది.

 శశికళ డిమాండ్

శశికళ డిమాండ్

తాను సమాధానం చెప్పాలంటే మీకు తన మీద ఎవరు ఫిర్యాదు చేశారో మొదట చెప్పాలని శశికళ డిమాండ్ చేస్తున్నారని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు ఆర్ముగస్వామి విచారణ కమిషన్ కు సమాచారం ఇచ్చారు.

 జైల్లో మౌనవ్రతం

జైల్లో మౌనవ్రతం

జయలలిత మరణించిన రోజు డిసెంబర్ 5వ తేదీ (మొదటి వర్దంతి) నుంచి శశికళ మౌనవ్రతం చేస్తున్నారని ఇటీవల ఆమెతో జైల్లో భేటీ అయ్యి వచ్చిన టీటీవీ దినకరన్ చెప్పారు. జనవరి 31వ తేదీ వరకు జైల్లో శశికళ మౌనవ్రతం చేస్తారని టీటీవీ దినకరన్ అన్నారు.

డ్రామాలు ఆడుతున్నారు

డ్రామాలు ఆడుతున్నారు

ఆర్ముగస్వామి విచారణ కమిషన్ విచారణ చేస్తారనే భయంతో శశికళ మౌనవ్రతం చేస్తున్నానని డ్రామాలు ఆడుతున్నారని అనేక మంది ఆరోపించారు. ఇప్పుడు శశికళ అడ్డం తిరిగి తన మీద ఎవరు ఫిర్యాదు చేశారో చెబితే సమాధానం ఇస్తానని అంటున్నారని వెలుగు చూసింది.

English summary
Sasikala has asked Arumugasamy Commission that who have given complaint against her, then only she will reply for commission's summon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X