చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Sasikala: చిన్నమ్మకు చిత్రాన్నం, మాకు ఆమె స్పెషల్ కాదు, హోమ్ మంత్రి, తప్పు చేస్తే రాజైనా అంతే !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ చెన్నై/ న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే. శశికళ నటరాజన్ జైలు నుంచి బయటకు వచ్చేస్తారని ఎదురు చూసిన ఆమె అనుచరులు షాక్ అయ్యారు. జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళూరుతున్న చిన్నమ్మ శశికళ ఆశలపై హోమ్ మంత్రి చల్లగా నీళ్లు చల్లారు. చట్టానికి లోబడి శశికళ విడుదల అవుతారని, ఆమె ఎందులోనా మాకు స్పెషల్ కాదని, ప్రత్యేకం అంతకంటే కాదని, ముందస్తు విడుదల మాత్రం ఉండదని, తప్పు చేస్తే రాజైనా అంతే అని కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ తేల్చి చెప్పారు. చిన్నమ్మ శశికళకు జైలు జీవితం పూర్తి అయ్యే వరకు చిత్రాన్నం గ్యారెంటీ అని వెలుగు చూడటంతో ఆమె అనుచరులు షాక్ అయ్యారు.

Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!Illegal affair: ఆంటీకి ఆ నలుగురు, ఒకడికి మండింది, మిల్క్ ట్యాంకర్ లా ఉందని ఒకటే ఫాలోయింగ్!

 చిన్నమ్మ జీవితంలో బ్లాక్ డే

చిన్నమ్మ జీవితంలో బ్లాక్ డే

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వీకే. శశికళ నటరాజన్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మాజీ పెంపుడు కొడుకు సుధాకరన్, శశికళ బంధువు ఇళవరి 2017 ఫిబ్రవరి 15వ తేదీన బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ, సుధాకరన్, ఇళవరికి ప్రత్యేక కోర్టు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. శశికళ జీవితంలో 2017 ఫిబ్రవరి 15వ తేదీ బ్లాక్ డేగా నిలిచిపోయింది.

 రూ. 10 కోట్లు ఫైన్ కట్టినా !

రూ. 10 కోట్లు ఫైన్ కట్టినా !

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 కోట్ల అపరాదరుసుం విధించారు. శశికళ న్యాయవాది రాజా చందూర్ పాండియన్ ఇటీవల రూ. 10 కోట్ల అపరాదరుసుం చెల్లించడానికి బెంగళూరు ప్రత్యేక కోర్టులో చెక్ సమర్పించారు. రూ. 10 కోట్ల ఫైన్ కూడా చెల్లించడంతో శశికళ అనుకున్న సమయం కంటే ముందుగా బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తారని వారం రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది.

 ఆర్ టీఐతో గందరగోళం

ఆర్ టీఐతో గందరగోళం

కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త (RTI) నరసింహమూర్తి సమాచార చట్టం కింద శశికళ ఎప్పుడు జైలు నుంచి విడుదల అవుతారు అంటూ కర్ణాటక జైళ్ల శాఖకు లేఖ రాశారు. 2021 జనవరిలో శశికళ జైలు నుంచి విడుదల అవుతారని కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని స్వయంగా ఆర్ టీఐ కార్యకర్త నరసింహమూర్తి ఇటీవల మీడియాకు చెప్పారు.

 చిన్నమ్మ మాకు స్పెషల్ కాదు

చిన్నమ్మ మాకు స్పెషల్ కాదు

కోర్టు ఆదేశాల మేరకు శశికళ నటరాజన్, సుధాకర్, ఇళవరసి 20121 ఫిబ్రవరి 15వ తేదీ వరకు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. అయితే వీకే శశికళ నటరాజన్ జనవరిలోనే జైలు నుంచి విడుదల చేస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్ క్లారిటీ ఇచ్చారు.

 హోమ్ మంత్రి దెబ్బతో ఢమాల్

హోమ్ మంత్రి దెబ్బతో ఢమాల్

అవినీతి నిరోధక చట్టం ప్రకారం కోర్టు తీర్పు ప్రకారం శిక్ష పడినవారు పూర్తికాలం జైలు శిక్ష అనుభవించాల్సి ఉందని, శశికళ కూడా నాలుగు సంవత్సరాల పూర్తి కాలం జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తారని, ఆమెను ప్రత్యేకంగా ముందుగా విడుదల చేసే అవకాశం లేదని కర్ణాటక హోమ్ శాఖా మంత్రి బసవరాజ్ బోమ్మయ్ విలేకరులు అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు.

Recommended Video

Ahead of Release From Jail, VK Sasikala's Assets Worth 1,500 Crore seized | Oneindia Telugu
 ఏ క్షణంలో అయినా విడుదల

ఏ క్షణంలో అయినా విడుదల

మరోవైపు శశికళ నటరాజన్ న్యాయవాది రాజా చందూర్ పాండియన్ బెంగళూరు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. కర్ణాటక ప్రభుత్వం విధివిధానాల ప్రకారం శశికళకు 129 రోజుల సెలవులు ఉన్నాయని, వాటిని ఆమె ఉపయోగించుకోలేదని, అందువలన జైలు నుంచి ముందుగానే విడుదల చెయ్యాలని న్యాయవాాది రాజా చందూర్ పాండియన్ బెంగళూరు కోర్టుకు మనవి చేశారు. శశికళ ఏక్షణంలో అయినా విడుదల అయ్యే అవకాశం ఉందని ఆమె న్యాయవాది రాజా చందూర్ పాండియ్ బెంగళూరులో మీడియాకు చెప్పారు. మొత్తం మీద శశికళ ముందుగా జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం లేదని కర్ణాటక హోమ్ మంత్రి బసబరాజ్ బోమ్మయ్ చెప్పడంతో చిన్నమ్మ అనుచరులు ఢీలా పడిపోయారు.

English summary
Karnataka government will not give any special relaxation over VK Sasikala release from the jail, state Home minister Basavaraj Bommai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X