షాక్: శశికళ నటరాజన్ నిజం, వీకే శశికళ ఫోర్జరీ: తుగ్లక్ టార్గెట్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని కలలుకంటున్న అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త, తుగ్లక్ పత్రిక ఎడిటర్ ఎస్. గురుమూర్తి షాక్ మీద షాక్ ఇస్తున్నారు.
జయ మేనకోడలు దీపా వర్గీయులపై శశికళ అండ్ కో దౌర్జన్యం: తాళం
ఈ దెబ్బతో అన్నాడీఎంకే పార్టీలోని శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. మంగళవారం ఎస్ గురుమూర్తి ట్వీట్టర్ లో శశికళను ఉద్దేశించి సంచల వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణించిన తరువాత శశికళ అన్నాడీఎంకే చీఫ్ అయ్యారని గుర్తు చేశారు.
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ నటరాజన్ ఇప్పుడు పార్టీలో అన్ని రహస్యంగా ఉండాలని కోరుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. శశికళ నటరాజన్ అనుకుంటున్న ఈ విషయం నిజం అని గురుమూర్తి అన్నారు.
రంగంలోకి వచ్చిన ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ: ఏం జరుగుతోంది ?
అయితే అన్నాడీఎంకే పార్టీలో మా కుటుంబ సభ్యులకు స్థానం లేదని, వారిని దగ్గరకు రానివ్వనని వీకే. శశికళ చెబుతున్నారని, ఇది పచ్చి అపద్దం అని గురుమూర్తి ఆమెకు ఝలక్ ఇచ్చారు. శశికళ నటరాజన్ అనుకుంటున్నది నిజం, వీకే శశికళ అనుకుంటున్నది అపద్దం అని ట్వీట్ చెయ్యడంతో చిన్నమ్మ వర్గీయులు షాక్ కు గురైనారు.

అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టే సమయంలో చిన్నమ్మ తాను వీకే శశికళ అని అందరికి పరిచయం చేసుకున్నారు. మా కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి రానివ్వనని, జయలలిత మీద ఓట్టు వేస్తున్నానని శపథం చేశారు.
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అంతే: తుగ్లక్ !
అయితే అంతకు ముందు శశికళ నటరాజన్ గా అందరికి తెలిసిన ఈమె లోలోపల అన్నాడీఎంకే పార్టీలోకి కుటుంబ సభ్యులను రప్పించడానికి ప్రయత్నిస్తున్నారని తుగ్లక్ పత్రిక ఎడిటర్ గురుమూర్తి చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు.
Sasikala.Natarajan wants it to be secret. Natrajan does not. This is the only difference of opinion between them. https://t.co/9GiYdvYzmM
— S Gurumurthy (@sgurumurthy) 17 January 2017
Confession his family is in charge of ADMK makes Sasikala just a facade. Sasikala Natarajan is real. VK Sasikala forgery. https://t.co/pgNlf3V2Ad
— S Gurumurthy (@sgurumurthy) 17 January 2017