వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ సెల్వంకు ఇలా చెక్ పెట్టారు: పక్కా ప్లాన్ తో సీఎం పోస్టు ఔట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను ఆపదవి నుంచి తప్పించడానికి రంగం సిద్దం అయ్యిందని విశ్వసనీయంగా తెలిసింది. పన్నీర్ సెల్వం స్థానంలో చిన్నమ్మ శశికళను కుర్చోపెట్టడానికి ఆమె అనుచరులు అన్ని సిద్దం చేసుకుంటున్నారు.

ఆదివారం మదురై జిల్లాలోని అలంగనల్లూరులో జల్లికట్టు సాహస క్రీడ ప్రారంభించడానికి వెలుతున్న పన్నీర్ సెల్వంను స్థానికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. శనివారం మదురై చేరుకున్న పన్నీర్ సెల్వంకు మరుసటి రోజు అలంగనల్లూరుకు వెలుతుంటే స్థానికులు ఝలక్ ఇచ్చారు.

<strong>మహిళలపై చెన్నై పోలీసుల ప్రతాపం: చేతికి చిక్కితే వరుసగా?</strong>మహిళలపై చెన్నై పోలీసుల ప్రతాపం: చేతికి చిక్కితే వరుసగా?

అయితే అన్నాడీఎంకే పార్టీలోని ఓ వర్గం నాయకులు కావాలనే పక్కా ప్లాన్ తో పన్నీర్ సెల్వంకు జల్లికట్టు సెగ పెట్టారని, ప్రజలలో ఆయనకు వ్యతిరేకత రావడానికి పావులుకదిపారని ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేశారు.

జల్లికట్టు నిర్వహణ విషయంలో శాంతిభద్రతలు కాపాడటంలో సీఎంగా పన్నీర్ సెల్వం పూర్తిగా విఫలం అయ్యారని ఆరోపణలు చేస్తూ అన్నాడీఎంకే మంత్రులే ఆయన్ను పదవి నుంచి తప్పించాలని ఎత్తులు వేస్తున్నారని తెలిసింది.

Sasikala Natarajan may be sworn as CM on January 28 says sources !

<strong>ఇదే చాన్స్: తమిళనాడు సీఎంగా చిన్నమ్మ శశికళ, డేట్ ఫిక్స్ చేశారు!</strong>ఇదే చాన్స్: తమిళనాడు సీఎంగా చిన్నమ్మ శశికళ, డేట్ ఫిక్స్ చేశారు!

ఇలాంటి సమయంలోనే చిన్నమ్మ శశికళకు సీఎంగా పట్టాభిషేకం చెయ్యాలని ప్లాన్ వేశారని సమాచారం.పలువురు పండితులతో చర్చించిన తరువాత వారి సూచనలు, సలహాల మేరకు మంచి రోజు అయిన ఈనెల 28వ తేదీన ఆదివారం శశికళ ప్రమాణస్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది.

ఆదివారం సెలవు దినం కావడంతో నిరసనలు పెద్ద ఎత్తున ఎదురైయ్యే అవకాశం తక్కువగా ఉండటంతో అదే రోజు ముహూర్తం ఖరారు చేశారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పన్నీర్ సెల్వం వర్గీయులు సోమవారం రాత్రి రహస్యంగా సమావేశం అయ్యి మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని చర్చించారని తెలిసింది.

English summary
Law and order in the state collapsing. Chief Minister O.Paneerselvam consulting with DGP about the Law and order in Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X