వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: శశికళకే అన్నాడీఎంకే పగ్గాలు: పార్టీ సిద్దాంతాలు మార్చేస్తా !

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎవరు అనే విషయం పై ఆ పార్టీ నేతలు క్లారిటీ ఇచ్చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు నెచ్చెళి శశికళ నటరాజన్ (54)ను నియమిస్తున్నామని ఆపార్టీ అధికార ప్రతినిధి పొన్నయన్ ప్రకటించారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శశికళ నాయకత్వాన్ని అన్నాడీఎంకే నాయకులు అందరూ కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అవసరం అయితే పార్టీ నిబంధనలను మార్చేస్తాం అంటు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sasikala Natarajan will be next General Secretary: AIADMK

జయలలితను ఎదురించిన మేనకోడలు దీపా: ఎప్పుడంటే !

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దాదాపు 28 ఏళ్లు జయలలిత పని చేశారు. తరువాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు భాద్యతలను జయలలిత సమర్థవంతంగా నిర్వహించారు.

అనారోగ్యంతో అమ్మ మరణించిన తరువాత తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అన్నాడీఎంకే చీఫ్ ఎవరూ ? అని ఆ పార్టీలో చర్చ మొదలైయ్యింది.

Sasikala Natarajan will be next General Secretary: AIADMK

శశికళకు చెక్: జయ మేనకోడలు దీపానే అన్నాడీఎంకే చీఫ్ !

అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా శశికళను నియమిస్తారని జయ టీవీ (ప్రస్తుతం శశికళ చేతిలో ఉంది) ప్రసారం చేసింది. అదే సమయంలో సీఎం పన్నీరు సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, పార్టీ సీనియర్లు శశికళను కలిసి పార్టీ పగ్గాలు చేపట్టాలని మనవి చేశారని వార్తలు వచ్చాయి.

Sasikala Natarajan will be next General Secretary: AIADMK

అయితే గురువారం ఒక్క సారిగా పార్టీ అధికార ప్రతినిధి పొన్నయన్ మీడియా ముందు అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ పని చేస్తారని చెప్పడంతో దాదాపు 90 శాతం క్లారిటీ వచ్చింది. ఈ నెల 21వ తేది జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో అధికారికంగా శశికళ పార్టీ పగ్గాలు చేపడుతారని తెలిసింది.

English summary
Sasikala Natarajan (54) will be the next General Secretary of the All India Dravida Munnetra Kazhagam (AIADMK), said party spokesperson Ponnaiyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X