బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు షాక్, పెరోల్ ఇవ్వడానికి కుదరదు, ఇప్పటికే అపవాదులు, ఇంకా కావాలా ?

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ కు చుక్కెదురైయ్యింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్ కు చుక్కెదురైయ్యింది. పెరోల్ మీద బయటకు వెళ్లడానికి తాము అవకాశం ఇవ్వమని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు తేల్చి చెప్పారు.

జైల్లో శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప జీవిత చరిత్రతో సినిమా, టార్గెట్ చిన్నమ్మ, ఏం చేస్తారు ?జైల్లో శశికళ ఎఫెక్ట్: డీఐజీ రూప జీవిత చరిత్రతో సినిమా, టార్గెట్ చిన్నమ్మ, ఏం చేస్తారు ?

శశికళ సొంత సోదరుడు సుందరవదనం సతీమణి సంతానలక్ష్మి మృతి చెందడంతో తనకు పెరోల్ ఇవ్వాలని చిన్నమ్మ కోర్టును ఆశ్రయించారు. అయితే శశికళకు పెరోల్ ఇవ్వరాదని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

Sasikala's application for parole was reportedly rejected

ఇప్పటికే శశికళ నటరాజన్ కు జైల్లో వీవీఐపీ సేవలు అందిస్తున్నారని అపవాదులు మూటకట్టుకున్న బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు ఇప్పుడు ఆమెకు పెరోల్ ఇవ్వడానికి అంగీకరిస్తే అందరూ దుమ్మెత్తిపోస్తారని పసిగట్టారు.

శశికళ జైల్లో కొంచం కూడా తగ్గలేదు, అంబులెన్స్ లో ఆహారం, సహాయం చేస్తున్న అధికారి!శశికళ జైల్లో కొంచం కూడా తగ్గలేదు, అంబులెన్స్ లో ఆహారం, సహాయం చేస్తున్న అధికారి!

శశికళకు పెరోల్ ఇవ్వకూడదని, ఆమె జైలు నుంచి బయటకు వెలితే లేనిపోని సమస్యలు వస్తాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. పెరోల్ రాకపోవడంతో శశికళ షాక్ కు గురైనారని సమాచారం.

English summary
Sasikala's application for parole was reportedly rejected by Bengaluru's Parappana Agrahara jail authorities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X