బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళ మేనల్లుడు మృతి: పెరోల్ కోసం సుప్రీం కోర్టుకు చిన్నమ్మ !

వీకే శశికళ నటరాజన్ సోదరుడు డాక్టర్ వినోదగన్ కుమారుడు మహదేవన్ (47) శనివారం గుండెపోటుతో మరణించడంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకావడానికి పెరోల్ ఇవ్వాలని చిన్నమ్మ శశికళ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నటరాజన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శశికళ సోదరుడు డాక్టర్ వినోదగన్ కుమారుడు టీవీ మహదేవన్ (47) గుండెపోటుతో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులో విషాదంలో మునిగిపోయారు.

శశికళ సోంత సోదరుడు డాదక్టర్ వినోదగన్ కుమారుడు మహదేవన్ వ్యాపారం చేస్తున్నాడు. మహదేవన్ తండ్రి డాక్టర్ వినోదగన్ ఇప్పటికే మరణించారు. గతంలో జయలలిత అమ్మ పేరవై తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టీవీ మహదేవన్ పని చేశారు.

దేవుడి దర్శనానికి వెళ్లి

దేవుడి దర్శనానికి వెళ్లి

తమిళనాడులోని కుంబకోణం సమీపంలోని తిరువడైమదుగు (తంజావూరు) ప్రాంతంలోని ప్రసిద్ది చెందిన శివుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి దైవదర్శనం చేసుకోవడానికి మహదేవన్ కుటుంబ సభ్యులుతో కలిసి వెళ్లారు.

చాతి నోప్పితో మృతి

చాతి నోప్పితో మృతి

శనివారం ఉదయం 9 గంటలకు దేవాలయంలో దైవదర్శనం చేసుకోవడానికి మహదవేవన్ సిద్దం అయ్యారు. ఆ సమయంలో చాతినోప్పి రావడంతో మదేవన్ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై మహదేవన్ మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.

శశికళకు సమాచారం

శశికళకు సమాచారం

మహదేవన్ చాతినోప్పితో మరణించాడని బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నశశికళకు సమాచారం ఇచ్చారు. మహదేవన్ అంత్యక్రియలకు హాజరుకావడానికి శశికళకు అనుమతి (పెరోల్) ఇవ్వాలని ఆమె న్యాయవాదులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

అంత్యక్రియలకు శశికళ

అంత్యక్రియలకు శశికళ

మహదేవన్ అంత్యక్రియలకు శశికళ హాజరయ్యే అవకాశం ఉందని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే మహదేవన్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు న్యాయస్థానం అనుమతి ఇవ్వాల్సి ఉంది.

మెడపట్టి గెంటేసిన జయలలిత

మెడపట్టి గెంటేసిన జయలలిత

2011 శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులను జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి మెడపట్టి బయటకు గెంటేశారు. వారిలో మహదేవన్ కూడా ఉన్నారు. అప్పటి నుంచి మహదేవన్ జయలలిత పేరవై పదవి నుంచి తప్పించారు. తరువాత జయలలిత మహదేవన్ ను దగ్గరకుకూడా రానివ్వలేదు.

English summary
Sasikala Natarajan will move the Supreme Court seeking parole to attend a funeral. In her parole application she will seek parole to attend the funeral of her nephew T V Mahadevan who died of a cardiac arrest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X