శశికళకు నో పెరోల్: దినకరన్ ఎఫెక్ట్, చిన్నమ్మకు ఇష్టం లేదా!
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ మేనల్లుడు టీవీ మహదేవన్ (47) అంత్యక్రియలకు ఆమె హాజరుకాలేకపోయారు. ఎలాగైనా పెరోల్ తీసుకు వస్తామని ధీమా వ్యక్తం చేసిన టీవీవీ దినకరన్ చివరికి చేతులు ఎత్తేశారు.
మహదేవన్ అంత్యక్రియలకు శశికళ వస్తారని ఆమె కుటుంబ సభ్యులు భావించారు. మహదేవన్ అంత్యక్రియలకు హాజరుకావడానికి శశికళకు పెరోల్ ఇవ్వాలని ఆమె కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించారు.

అయితే చివరికి శశికళ హాజరుకాకుండానే మహదేవన్ అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఆదివారం తంజావూరులో మహదేవన్ అంత్యక్రియలు పూర్తి చెయ్యాలని ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ తంజావూరు చేరుకుని మహదేవన్ కు నివాళులు అర్పించారు. దినకరన్ తో పాటు ఆయన అనుచరులు మహదేవన్ కు నివాళులు అర్పించారు. అయితే శశికళ మహదేవన్ అంత్యక్రియలకు హాజరౌతారని అనుకున్న శశికళ వర్గీయులు చివరికి నిరాశకు గురైనారు.












Click it and Unblock the Notifications