వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళకు హైకోర్టు షాక్, మేనల్లుడికి రూ. 25 కోట్లు ఫైన్

శశికళ మేనల్లుడు, మాజీ ఎంపీ దినకరన్ రూ. 25 కోట్లు అపరాద రుసుం చెల్లించాలని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు సీఎం కావాలని ఆశపడుతున్న నెచ్చెలి శశికళకు ఇప్పుడు టైం బాగలేనట్లుంది. ఆమె మేనల్లుడు దినకరన్ రూ. 25 కోట్లు అపరాద రుసుం చెల్లించాలని మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు చెప్పడంతో చిన్నమ్మ అనుచరులు షాక్ కు గురైనారు.

చూడమ్మ'చిన్నమ్మ'పోటి చేస్తే సినిమా చాపిస్తామమ్మ, జాగ్రత్త !

ప్రస్తుత అన్నాడీఎంకే చీఫ్ శశికళకు మేనల్లుడు అయిన టీ.టీ.వీ. దినకరన్ కు రూ. 25 కోట్ల అపరాద రుసుం చెల్లించాలని శుక్రవారం మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎంపీ అయిన దినకరన్ విదేశీ నగదు బదిలీ చట్టం (FERA)కింద ఇప్పుడు అపరాద రుసుం చెల్లించాలని మద్రాసు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

1991 నుంచి 1995 వరకు జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ మద్య కాలంలో దినకరన్ బ్యాంకు అకౌంట్ లకు భారీ మొత్తంలో (కోట్ల రూపాయలు) విదేశాల నుంచి నగదు డిపాజిట్ చేశారు.

Sasikala's nephew should pay Rs 25 crore penalty: Madras High Court

ఆ సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విషయం గుర్తించి అక్రమంగా విదేశీ నగదు డిపాజిట్ చేసినందుకు రూ. 25 కోట్ల జరిమానా చెల్లించాలని దినకరన్ కు ఆదేశాలు జారీ చేశారు. తాను సింగపూర్ సిటిజన్ అని దినకరన్ ఈడీ ముందు వాదించారు. అయితే మాజీ ఎంపీ అయిన వ్యక్తి సింగపూర్ సిటిజన్ ఎలా అవుతారని ఈడీ న్యాయపోరాటం చెయ్యడానికి సిద్దం అయ్యింది.

జయలలిత మేనకోడలు దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు

ఈడీ ఆదేశాలను సవాలు చేస్తూ దినకరన్ మద్రాస్ హైకోర్టు ట్రిబునల్ లో అప్పీలు చేసుకున్నారు. శుక్రవారం కేసు విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీకి దినకరన్ రూ. 25 కోట్లు అపరాద రుసుం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఎంపీ దినకరన్ పెట్టుకున్న పిటిషన్ ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. శశికళ మేనల్లుడికి న్యాయస్థానం రూ. 25 కోట్లు జరిమానా విధించడంతో ప్రతిపక్షాల చేతికి ఓ అస్త్రం చిక్కింది. ఇప్పుడు శశికళ మీద విమర్శలు చెయ్యడానికి ప్రతిపక్ష నాయకులు సిద్దం అయ్యారు.

English summary
In a setback to Sasikala Natarajan's nephew TTV Dinakaran, the Madras High Court on Friday upheld a tribunal court's order of Rs 25 crore penalty on him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X