వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో రాష్ట్రపతి పాలన?

తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలనను 54 శాతం మంది కోరుకొంటున్నారు. తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకొంటున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:తమిళనాడులో అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ మద్య రేగిన చిచ్చు ఆ రాష్ట్ర రాజకీయాల్లో క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 54 శాతం ప్రజలు రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఓటు చేశారు. లేదా తాజజాగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకొంటున్నారు.

తమిళనాడు రాష్ట్రంలో అన్నాడిఎంకె రాజకీయాల్లో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ప్రజలు విసిగిచెందారు. ఈ పరిణామాలపై ప్రజలు రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఓటు చేశారు. లేదా తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకొంటున్నారు.

president rule

అన్నాడిఎంకె పరిణామాల నేపథ్యంలో ఆన్ లైన్ లో నిర్వహించిన సర్వేలో నెటిజన్లు అనుహ్యరీతిలో స్పందించారు. 54 శాతం ప్రజలు రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఓటు చేశారు.

సోషల్ ఎంగేజ్ మెంట్ అనే సంస్థ తమిళనాడులో చోటుచేసుకొన్న పరిణామాలపై ఆన్ లైన్ లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రజలు 54 శాతం రాష్ట్రపతి పాలనను కోరుకొన్నారు. అంతేకాదు తాజాగా ఎన్నికలు నిర్వహించాలని కోరుకొన్నారు.

రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలనేది అసెంబ్లీ నిర్ణయిస్తోందని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు.మరో వైపు పదిశాతం మంది అన్నాడిఎంకె నేతలు ముఖ్యమంత్రిని నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి కూడ తమిళనాడులో రాష్ట్రపతి పాలనను పెట్టాలని డిమాండ్ చేశారు.

తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిఎంకె కూడ కోరుతోంది. అన్నాడిఎంకెలో నెలకొన్న సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని డిఎంకె వ్యూహలను రచిస్తోంది. తాజాగా ఎన్నికలు నిర్వహిస్తే తమకు ప్రయోజనం కలుగుతోందనేది డిఎంకె భావన.

English summary
as tamilnadu sinks deeper into a political crisis with a fight between a caretaker governament and the chief of ruiling party an online survey shows what many believe the centre is seriously pondering upon.54 percent of people in tamilnadu favour imposition of president;s rule and calling fresh elections to elect new governament in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X