వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా గోతులు తవ్వుతోందా?: ఒకవంక చర్చలు..మరోవంక భారీగా సైనిక శిబిరాలు: వాస్తవాధీన రేఖ వద్ద

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా ముందుకొచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతమైన లఢక్ సమీపంలో చైనా సరిహద్దుల వద్ద ఈ చర్చల ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఉదయం 11:30 గంటల సమయంలో రెండు దేశాలకు చెందిన మిలటరీ లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య తొలివిడ చర్చలు ప్రారంభం అయ్యాయి. లఢక్ సరిహద్దు ప్రాంతాలు దీనికి వేదిక అయ్యాయి.

భారత్‌పై విషం కక్కుతోన్న చైనా: పెద్ద నేరం: ఆ మాటలు విని ఇక్కడిదాకా తెచ్చుకుందటభారత్‌పై విషం కక్కుతోన్న చైనా: పెద్ద నేరం: ఆ మాటలు విని ఇక్కడిదాకా తెచ్చుకుందట

 మాల్డో-ఛుసుల్ బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ వద్ద..

మాల్డో-ఛుసుల్ బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ వద్ద..

భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి మిలటరీ అధికారుల మధ్య చర్చలు ఆరంభం అయ్యాయి. ఈ చారిత్రాత్మక సంఘటనకు లడక్ సరిహద్దు ప్రాంతం వేదికగా మారింది. చైనా భూభాగంలోని మాల్డోలో ఈ రెండు దేశాల మధ్య చర్చలకు వేదికగా మారింది. భారత్ భూభాగంపై సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఛుసుల్‌కు సమీపంలో ఉంటుందీ మాల్దో. మాల్దో-చుసుల్ బోర్డర్ పర్సనల్ మీటింగ్ పాయింట్ వద్ద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి.

పాల్గొన్నది వీరే..

పాల్గొన్నది వీరే..

రెండు దేశాల మిలటరీ తరఫున లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు ఈ చర్చల్లో పాల్గొనబోతున్నారు. మనదేశ ఆర్మీ తరఫున 14 కార్ప్స్ కమాండర్ లెప్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ దీనికి సారథ్యం వహించనున్నారు. హరీందర్ సింగ్ నేతృత్వంలోని భారత ఆర్మీ ప్రతినిధుల బృందం ఈ చర్చలకు హాజరవుతుంది. చైనా తరఫున పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొననున్నారు. సరిహద్దుల్లో మోహరింపజేసిన సైనికులను ఉపసంహరించడం, సైనిక శిబిరాలను తొలగించాలనేది భారత ప్రధాన డిమాండ్. దీనిపై చైనా వైఖరి ఏమిటనేది ఇంకా తేలాల్సి ఉంది.

 చర్చలు కొనసాగిస్తూనే..

చర్చలు కొనసాగిస్తూనే..

ఒకవంక చర్చలను కొనసాగిస్తూనే..చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరింపజేసింది. చర్చలు కొనసాగుతున్న సమయంలో అక్కడ సైనిక శిబిరాలు వెలిశాయి. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా విడుదల అయ్యాయి. లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా భూభాగంపై పెద్ద ఎత్తున మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రిని చేరవేసింది. కొత్తగా సైనిక శిబిరాలను నెలకొల్పింది.

Recommended Video

#IndiaChinaBorder : భారత్ - చైనా సరిహద్దు వివాదానికి.. తెర దించే దిశగా తొలి అడుగు!
 5,6 తేదీల నుంచి తరలింపు..

5,6 తేదీల నుంచి తరలింపు..

ఈ నెల 5, 6 తేదీల నుంచే చైనా తన సైన్యాన్ని సరిహద్దులకు తరలించడాన్ని ప్రారంభించింది. చర్చలకు అంగీకరించిన తరువాత.. చర్చలు ప్రారంభమైన తరువాతా.. తరలింపునకు బ్రేక్ పడకపోవడం చైనా దూకుడు వైఖరికి అద్దం పడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవాధీన రేఖ (Line Of Actual Control-LAC) వెండి ఉన్న గోగ్రా, పెట్రోలింగ్ పాయింట్-14, పెట్రోలింగ్ పాయింట్-15, ఫోర్ ఫింగర్, గ్రీన్ టాప్ పాయింట్లలో పీఎల్ఏ బలగాలు మోహరించారు. సైనిక శిబిరాలను ఏర్పాటు చేశారు.

English summary
Meanwhile, high-resolution satellite images of the Pangong Tso area in Ladakh show the Chinese had built “substantial” structures between Finger 4 and Finger 8, changing the status quo. Colonel S Dinny, who was commanding officer of an Indian Army battalion at Pangong Tso between 2015 and 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X