నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డీఆర్‌డీఓ నూతన ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి సతీష్ రెడ్డి నియామకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ శాఖలో కీలకమైన రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఛైర్మన్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన డా. సతీశ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది.

నెల్లూరు జిల్లాకు చెందిన సతీశ్‌రెడ్డి ప్రస్తుతం రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు హోదాలో ఉన్నారు. అంతకుముందు హైదరాబాద్‌ డీఆర్‌డీవోలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌కు డెరైక్టర్‌గా ఉన్నారు.

Satheesh Reddy is new DRDO Chairman

మనోహర్ పారికర్‌ రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న సమయంలో సలహాదారుగా నియమితులయ్యారు. అనంతపురంలో బీటెక్‌, జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్‌ పూర్తి చేసిన సతీశ్‌రెడ్డి.. 1985లో డీఆర్‌డీవోలో చేరారు. నావిగేషన్‌, ఏవియానిక్స్‌ టెక్నాలజీ రంగాల్లో విశేషమైన పరిశోధనలు చేశారు సతీష్ రెడ్డి.

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నుంచి హోమీ జహంగీర్‌ బాబా స్మారక అవార్డు, స్వావలంభన పరిశోధనకు ప్రధాని నుంచి అవార్డు తదితర సత్కారాలను అందుకున్నారు. జూన్‌లో ఎస్ క్రిస్టోఫర్ రిటైరైన నేపథ్యంలో సతీష్ రెడ్డి డీఆర్డీఓ ఛైర్మన్ స్థానంలో నియామకమయ్యారు.

English summary
Distinguished aerospace scientist G. Satheesh Reddy was on Saturday appointed the Chairman of the Defence Research Development Organisation (DRDO) and Secretary in the Department of Defence Research and Development (DDR&D).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X