వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు 'సత్యం' రామలింగరాజు ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కార్పోరేట్ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరుగాంచిన 'సత్యం కుంభకోణం' కేసు విచారణను నిందితులందరూ అక్టోబర్ 27న తమ ముందు హాజరు కావాలని హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టు సోమవారం ఆదేశించింది. జడ్జిమెంట్‌కి స్పష్టమైన తేదీని ప్రకటించలేదని సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె సురేందర్ తెలిపారు.

సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ ఛైర్మన్ రామలింగ రాజు, ఆయన కుటుంబ సభ్యులు, సత్యం అధికారులు, ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ మాజీ ఆడిటర్లు ఆదేశించిన తేదీన కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు, సత్యం కంప్యూటర్స్ సిఎఫ్‌ఓ వడ్లమాని శ్రీనివాస్‌, ఆడిటింగ్‌ నిర్వహించిన పీడబ్లుయసీ ఆడిటింగ్‌ సంస్థతోపాటు ఆడిటర్లు తళ్లూరి శ్రీనివాస్‌, గోపాలకృష్ణన్‌తోపాటు దాదాపు 15 మందిని నిందితులుగా పేర్కొంది.

నేర విచారణ చట్టంలోని సెక్షన్‌ 200తోపాటు సెబీ చట్టంలోని సెక్షన్లు 12(ఎ), 24(1), 26, 27ల కింద క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. అంతేగాక, సత్యం కంప్యూటర్స్‌కు ఆడిటింగ్‌ నిర్వహించిన ఆడిటర్లు నమ్మకద్రోహానికి పాల్పడ్డారని, తప్పుడు ఆడిటింగ్‌ నివేదికలు ఇచ్చి లక్షలాది మంది మదుపరులను మోసం చేశారని సెబి ఆరోపించింది.

2009 జనవరి 7న అప్పట్లో సత్యం కంప్యూటర్‌‌స చైర్మన్‌గా ఉన్న రామలింగరాజు తన తప్పిదాలను అంగీకరిస్తూ సెబికి మెయిల్‌ పంపించారు. షేర్ల విక్రయం ద్వారా రూ.543.93 కోట్ల మేరకు రాజు సోదరులు అనుచిత లబ్ధి పొందారని, షేర్లను తాకట్టు పెట్టడం ద్వారా రూ.1,258 కోట్లను పొందారని సెబి పేర్కొంది.

రామలింగ రాజు

రామలింగ రాజు

సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ చైర్మన్ రామలింగ రాజు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై, తిరిగి వెళ్తున్న దృశ్యం.

రామలింగ రాజు

రామలింగ రాజు

సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ చైర్మన్ రామలింగ రాజు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై, తిరిగి వెళ్తూ...

రామలింగ రాజు

రామలింగ రాజు

సత్యం కంప్యూటర్స్ సంస్థాపకుడు, మాజీ చైర్మన్ రామలింగ రాజు సోమవారం హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరై, తిరిగి వెళ్తున్న దృశ్యం.

రామలింగ రాజు

రామలింగ రాజు

'సత్యం కుంభకోణం' కేసు విచారణను నిందితులందరూ అక్టోబర్ 27న తమ ముందు హాజరు కావాలని హైదరాబాదు నాంపల్లిలోని సీబీఐ కోర్టు సోమవారం ఆదేశించింది.

English summary
The special court on Satyam scam has deferred the case to October 27.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X